జాలర్లను భయపెట్టిన ఒంటికన్ను షార్క్.. ఫొటోలు చూస్తే మీరు కూడా భయపడాల్సిందే..

జాలర్లను భయపెట్టిన ఒంటికన్ను షార్క్.. ఫొటోలు చూస్తే మీరు కూడా భయపడాల్సిందే..

చేపల వేటకు వెళ్లిన జాలర్లకు ఓ వింతైన షార్క్ కంటపడింది. తలమధ్యలో ఒంటికన్నుతో ఉన్న షార్క్ చూడటానికి కాస్త భయంకరంగానే ఉంది. మలుకు ప్రావిన్స్‌కు చెందిన ఆండీ కొంతమందితో కలిసి అక్టోబర్ 10న చేపల వేటకు వెళ్లాడు. వారికి వలలో ఒక భారీ షార్క్ చిక్కింది. అయితే వారు వేట ముగించుకొని ఒడ్డుకు వచ్చేసరికే ఆ షార్క్ చనిపోయింది. దాంతో ఆ జాలర్లు షార్క్‌ని కోసి చూడగా.. దాని కడుపులో నుంచి మరో మూడు షార్క్ పిల్లలు బయటపడ్డాయి. ఆ పిల్లలు కూడా చనిపోయి ఉన్నాయి. వాటిలో ఒక పిల్ల షార్క్ చూడటానికి వింత ఆకారంలో ఉంది. మిల్కీ వైట్ కలర్‌లో ఉన్న ఆ పిల్ల షార్క్.. తలకు మధ్యలో ఒకే కన్నుతో ఉంది. అప్పుడప్పుడే దాని రెక్కలు, ఇతర భాగాలు ఏర్పడుతున్నాయి. వింతగా ఉన్న ఆ షార్క్‌ని చూసిన జాలర్లు వెంటనే స్థానిక సముద్ర కార్యాలయానికి సమాచారమిచ్చారు. బేబీ షార్క్‌లో సైక్లోపియా అనే వ్యాధి ఉందని సముద్ర కార్యాలయ అధికారి తెలిపారు. ఇది పుట్టుకతో వచ్చే వైకల్యమని.. అందువల్లే రెండు కన్నుల బదులు ఒక కన్ను మాత్రమే ఏర్పడిందని వారు తెలిపారు. ఇటువంటి వ్యాధిని మెడికల్ భాషలో అల్బినిజం అంటారు. షార్క్ తక్కువ మొత్తంలో మెలనిన్ ఉత్పత్తి చేయడం వల్లే ఇలాంటి షార్క్ పిల్లలు జన్మిస్తాయని అధికారులు అన్నారు.

For More News..

ప్లేట్ బిర్యానీ రూ. 10 ఆఫర్.. అడ్డుకొని ఫ్రీగా పంచిపెట్టిన పోలీసులు

తెలంగాణలో కొత్తగా 1,579 కరోనా కేసులు

అడవి పందులు వెంటపడ్డయని నీటిలో దూకిన అన్నదమ్ములు.. ఈతరాక మృతి