ధరణిలో కొత్త ఆప్షన్..భూ సమస్య ఏదైనా చెప్పుకోవచ్చు

ధరణిలో కొత్త ఆప్షన్..భూ సమస్య ఏదైనా చెప్పుకోవచ్చు

హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లూ కొన్ని రకాల భూ సమస్యలపైనే దరఖాస్తు చేసుకునే అవకాశమున్న ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌లో ఇప్పుడు భూ సమస్య ఏదైనా అప్లై చేసుకునే ఆప్షన్ చేర్చారు. గ్రీవెన్సెస్ – ల్యాండ్ మ్యాటర్స్ పేరిట శుక్రవారం ప్రారంభించిన ఈ  మాడ్యుల్‌‌‌‌‌‌‌‌లో అన్ని రకాల సమస్యలను విన్నవించుకోవడంతో పాటు తమ వద్ద ఉన్న సపోర్ట్ డాక్యుమెంట్లను పోర్టల్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయొచ్చు. పార్ట్ బీలో చేర్చడం వల్ల లేదంటే ఇతర కారణాలతో భూములకు పట్టాదారు పాస్ బుక్స్ రానోళ్లు, కొత్త పాస్ బుక్ వచ్చినా ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌లో సర్వే నంబర్, భూమి వివరాలు కనిపించని వాళ్లు, రెండు మూడేళ్ల క్రితమే రిజిస్ట్రేషన్ అయినా మ్యుటేషన్ కానోళ్లు, భూ విస్తీర్ణం ఎక్కువ లేదా తక్కువగా నమోదైన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. వ్యవసాయ భూములు ఇళ్ల స్థలాలుగా చూపిస్తున్నా, స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నాక కట్టిన డబ్బులు తిరిగి రాకున్న, జీపీఏ, ఏజీపీఏ, డీఏజీపీఏలో సమస్యలు, ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన భూమిలో తప్పులున్నా, రికార్డుల్లో పేరు తప్పుగా ఎంటర్ చేసినా, ఇతర సమస్యలు ఏవి ఉన్నా ధరణి ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

నేరుగా కలెక్టర్ లాగిన్‌‌‌‌‌‌‌‌లోకి.. 

గ్రీవెన్సెస్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌ మ్యాటర్స్‌‌‌‌‌‌‌‌ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌ అప్లికేషన్లన్నీ నేరుగా కలెక్టర్ల లాగిన్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లనున్నాయి. సమస్యను బట్టి అక్కడి నుంచి తహసీల్దార్లకు ఫార్వర్డ్ కానున్నాయి. గతంలో సీఎస్ ప్రకటించిన వాట్సాప్ నంబర్, మెయిల్ ఐడీకి వివిధ భూ సమస్యలపై ప్రజల నుంచి సుమారు 23 వేల అప్లికేషన్లు వచ్చిన విషయం తెలిసిందే. వీటిలో రైతుబంధు సంబంధిత అప్లికేషన్లు తప్పా మిగతావేవీ పరిష్కారం కాలేదు. అంతేగాక తమ భూ సమస్యను వాట్సాప్ చేసిన కొందరు బాధితులకు ‘మీరు దగ్గర్లోని మీ సేవ సెంటర్ కు వెళ్లి అప్లై చేసుకోండి’ అని మెసేజ్‌‌‌‌‌‌‌‌లూ వచ్చాయి. కొన్ని ప్రత్యేక సమస్యలకు ధరణిలో ఆప్షన్ లేక వారు మీ సేవ ద్వారా అప్లికేషన్ పెట్టుకోలేకపోయారు. అందుకే ఎలాంటి భూ సమస్య ఉన్నా ధరణి ద్వారా అప్లికేషన్ స్వీకరించేందుకు గ్రీవెన్సెస్ – ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యుల్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిసింది. 

కొత్త మాడ్యుల్‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకోవడం ఇలా.. 

ధరణి సిటిజన్ లాగిన్ ద్వారా పోర్టల్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి తమ సమస్యను నమోదు చేయొచ్చు. ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ కాగానే దరఖాస్తుదారు/సంస్థ పేరు, మొబైల్ నంబర్, ఇంటి నంబర్, ఉంటున్న ఏరియా, జిల్లా, మండలం, గ్రామం, పిన్‌‌‌‌‌‌‌‌కోడ్, ఈ మెయిల్ ఐడీ తదితర వివరాలు తప్పనిసరిగా నింపాలి. ఆ తర్వాత దరఖాస్తుదారుకు సంబంధించిన ల్యాండ్ వివరాలు ఇవ్వాలి. అందులో భూమి ఉన్న జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ వివరాలతో పాటు ఆ భూమిపై గ్రీన్ పాస్ బుక్ ఉంటే బుక్ నంబర్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ చేయాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ వివరాలు ఎంటర్‌‌‌‌‌‌‌‌ చేశాక నేచర్ ఆఫ్ గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్న 10 రకాల ఆప్షన్లలో తమ సమస్యకు సంబంధించిన ఆప్షన్ ఉంటే ఎంచుకోవాలి. పదింట్లో ఏది కాకపోతే ‘అదర్స్’ ఆప్షన్ ఎంచుకుని సమస్య గురించి కింద డిస్క్రిప్షన్ బాక్స్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయొచ్చు. ఆ తర్వాత తమ దగ్గర ఉన్న సపోర్టింగ్ డాక్యుమెంట్లను ఒక్కో ఫైల్ 1ఎంబీ మించకుండా అప్‌‌‌‌‌‌‌‌లోడ్  చేయాలి. ఆ డాక్యుమెంట్ గురించి 250 పదాలకు మించకుండా రిమార్క్స్ బాక్స్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయొచ్చు. ఇదే పద్ధతిలో తమ దగ్గర ఉన్న లింక్ డాక్యుమెంట్లను ఇందులో యాడ్ చేసుకుంటూ పోవచ్చు. చివరగా సబ్మిట్ చేస్తే దరఖాస్తుదారు ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీకి రిప్లై వస్తుంది.