
హైదరాబాద్, వెలుగు:మైనారిటీ గురుకులాల్లో సీఎం కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం గురుకులాల ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సంబరాలకు రూ.10వేల వరకు ఖర్చు చేసుకోవచ్చని ప్రిన్సిపాళ్లకు పర్మిషన్ ఇచ్చారు. సంబరాల్లో స్టూడెంట్స్, టీచర్లు, లోకల్ లీడర్లు, పేరెంట్స్‌ను భాగస్వామ్యం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారికి స్పెషల్ లంచ్ ఏర్పాటు చేయాలని, గేమ్స్ కండక్ట్ చేసి ప్రైజ్‌లు డిస్ట్రిబ్యూట్ చేయాలని వెల్లడించింది. తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ పాత్ర, మైనార్టీ గురుకులాల ఏర్పాటు, మిషన్ భగీరథ, పల్లెప్రగతి, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇతర స్కీంలపై డిస్కషన్ చేయాలని సూచించారు. కాగా అధికారుల తీరుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. మైనారిటీ గురుకులాల నిర్ణయంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.