ఎన్నికలు సమీపిస్తుండడంతో రంగంలోకి లీడర్లు

ఎన్నికలు సమీపిస్తుండడంతో రంగంలోకి లీడర్లు

మహబూబ్​నగర్, వెలుగు: ఎన్నికలు సమీపిస్తుండడంతో పాలమూరు ప్రతిపక్షాలు యాక్టివ్‌‌‌‌‌‌‌‌ మోడ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చేశాయి. మూడున్నరేండ్లుగా అడపాదడపా నిరసనలు తప్ప పెద్దగా జనాల్లోకి వెళ్లని పార్టీలు  రెండుమూడు నెలలుగా జోరు పెంచాయి.  ప్రభుత్వంపై వ్యతిరేకతను టార్గెట్‌‌‌‌‌‌‌‌గా చేసుకొని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్​ రోజుకో ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ పేరుతో  ప్రజల్లోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై యూత్​,  వ్యవసాయ రంగ సమస్యలపై రైతాంగంతో కలిసి పోరాటాలు చేస్తున్నాయి. అధికార పార్టీ కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పేరిట జనాల వద్దకు వెళ్తోంది. 

లోకల్‌‌‌‌‌‌‌‌ ఇష్యూస్‌‌‌‌‌‌‌‌పై ఎటాక్​

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీలు లోకల్‌‌‌‌‌‌‌‌ ఇష్యూస్‌‌‌‌తో ప్రభుత్వంపై ఎటాక్ చేస్తున్నాయి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్​రెడ్డి 69 జీవో అమలు, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నిధులతోనే పనులు చేస్తూ.. తిరిగి కేంద్రంపైనే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఆరోపణలు చేస్తున్నారని ఫైర్​ అవుతున్నారు. రూలింగ్​పార్టీకి చెందిన లీడర్ల ఇసుక, మట్టి, భూ దందాలపై విరుచుకు పడుతున్నారు. ఇదే సమయంలో కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి  కేడర్​కు దిశానిర్దేశం చేస్తున్నారు.  మహబూబ్​నగర్​ డీసీసీ కొత్త ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జి.మధుసూదన్​రెడ్డి (జీఎంఆర్) జెట్​స్పీడులో దూసుకుపోతున్నారు. ఇటీవల భూత్ఫూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలోని సిద్దాయిపల్లిలో అనర్హులకు ఇండ్లు కేటాయించారని ఆరోపిస్తూ పేదలతో కలిసి భూత్ఫూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి,  నాగర్​కర్నూల్​డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ పెండింగ్‌‌‌‌‌‌‌‌ కేఎల్‌‌‌‌‌‌‌‌ఐ కెనాల్స్‌‌‌‌‌‌‌‌, నెట్టెంపాడు, మార్కండేయ లిఫ్ట్ ఇష్యూస్‌‌‌‌‌‌‌‌తో పాటు రైతులకు మద్దతు ధర,  ఎమ్మెల్యేల మట్టి, ఇసుక దందాపై ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తున్నారు.  

డిఫరెంట్​ కాన్సెప్ట్​తో జనంలోకి..

జడ్చర్ల కాంగ్రెస్​ లీడర్​జనంపల్లి అనిరుధ్​రెడ్డి డిఫరెంట్ ​కాన్సెప్ట్​తో ప్రజల్లోకి వెళ్తున్నారు. డిసెంబరు 31 ఆయన బర్త్​డే ఉంటే, ఒక రోజు ముందే డిసెంబర్​30న రాత్రి మ్యూజికల్​ నైట్​ నిర్వహించారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జడ్చర్ల టౌన్‌‌‌‌‌‌‌‌తో పాటు చుట్టూ మండలాలకు చెందిన దాదాపు 30 వేల మంది హాజరయ్యారు.  సంక్రాంతి పండుగ సందర్భంగా ఆన్​లైన్​ ద్వారా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు  ఈ ముగ్గుల పోటీలో ఇప్పటికే 20 వేల మంది మహిళలు పాల్గొంటుండగా, పండుగ రోజు విన్నర్స్​ను అనౌన్స్​ చేయనున్నారు.  అలాగే ప్రజా సమస్యలు,  పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ఐ నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తున్నారు.

ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు..

రూలింగ్​ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు డెయిలీ గ్రామాల్లో పర్యటిస్తున్నారు.   కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​, సీఎం రిలీఫ్‌‌‌‌ ఫండ్‌‌‌‌ చెక్కులు, సీసీ రోడ్లకు భూమి పూజలు.. లాంటి చిన్న కార్యక్రమాలకు కూడా చీఫ్​గెస్టులుగా హాజరవుతున్నారు.  ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ‘గుడ్‌‌‌‌‌‌‌‌ మార్నింగ్ నాగర్ కర్నూల్’ పేరిట ప్రతి రోజూ జనాల్లోకి వెళ్తున్నారు. మంత్రులు నిరంజన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌‌‌‌‌‌‌‌లు సైతం ఎక్కువ సమయం నియోజకర్గంలోనే ఉంటున్నారు. 

పాదయాత్రతో ఎల్లేని అట్రాక్ట్​

కొల్లాపూర్​ నుంచి బీజేపీ లీడర్ ఎల్లేని సుధాకర్​రావు పాదయాత్రతో జనాన్ని అట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.  డిసెంబరు 8న చిన్నంబావి మండలం మియాపూర్​ గ్రామం సత్యమ్మ తల్లి దేవత టెంపుల్​ నుంచి మొదలైన ఆయన యాత్ర ఇప్పటికే 500 కి.మీ. దాటింది. ఈ నెల 12న యాత్ర కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  చేరుకొని ఎండ్​ కానుంది.  ఈ యాత్రలో హుజూరాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. యాత్ర ముగింపు సభకు పార్టీ స్టేట్​ చీఫ్​​బండి సంజయ్​ కుమార్​ హాజరుకానుండటతో అంతటా ఆసక్తి నెలకొన్నది. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులతో క్యాలెండర్ రెడీ చేయించి.. స్వయంగా ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తున్నారు.