ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తేలిన అభ్యర్థుల లెక్క.. ముగిసిన ఉపసంహరణ ప్రక్రియ..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తేలిన అభ్యర్థుల లెక్క.. ముగిసిన ఉపసంహరణ ప్రక్రియ..
  • ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పార్టీలకు తప్పని రెబల్స్ బెడద
  • నేటి నుంచి హోరెత్తనున్న ప్రచారం

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారులు పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను మంగళవారం రాత్రి ప్రకటించారు. ఒక్కో వార్డులో నలుగురైదురు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్  అభ్యర్థులకు పలుచోట్ల రెబల్స్ బెడద సమస్యగా మారింది. ఆయా పార్టీల నాయకులు బుజ్జగించినా చివరికి కొందరు ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచారు. 

 స్పీడందుకోనున్న ప్రచారం..

విత్ డ్రా ప్రక్రియ ముగియడంతో నేటి నుంచి ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. ప్రధాన పార్టీల లీడర్లు, అభ్యర్థులు జోరుగా ప్రచారం చేయనున్నారు. డివిజన్లు, వార్డుల్లో సమస్యలపై స్పెషల్ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెడుతూ.. తాము గెలిస్తే ఏం చేస్తామో
 వివరించనున్నారు. 

కరీంనగర్ కార్పొరేషన్ ఆఫీసు ఎదుట ఇండిపెండెంట్ల ఆందోళన 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి నత్తనడకన సాగుతోంది. నామినేషన్ల విత్ డ్రా, బీఫార్మ్ ల అందజేత ముగిశాక ఇండిపెండెంట్ అభ్యర్థులకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు గుర్తులు కేటాయిస్తామని చెప్పడంతో వారంతా ఆఫీసుకు చేరుకున్నారు. రాత్రి 9 గంటలు దాటినా గుర్తులు కేటాయించకపోవడంతో ఆందోళనకు దిగారు. తమకు త్వరగా గుర్తులు కేటాయిస్తే ప్రచార సామగ్రి సిద్ధం చేసుకోవాలని, ఇంకెంత సమయం తీసుకుంటారని ప్రశ్నించారు.

 బీఫామ్ ఇవ్వలేదని బీజేపీ రాజీనామా 

రాజన్నసిరిసిల్ల,వెలుగు: తమకు బీఫామ్ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు మాజీ కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బొల్గం నాగరాజు గౌడ్ బీజేపీ రిజైన్ చేశారు. మంగళవారం తన రాజీనామా పత్రాన్ని సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహానికి సమర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్లలో కొంతమంది బీజేపీ నాయకులు చివరివరకు తనకు టికెట్ ఇస్తామని మోసం చేశారని, టికెట్ కావాలంటే డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించాడు. 8 ఏండ్లుగా కట్టుబడి పనిచేస్తున్నానన్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బల్దియా    డివిజన్‌‌‌‌‌‌‌‌/వార్డులు     అభ్యర్థులు 

కరీంనగర్                66                      398 

రామగుండం           60                      315

జమ్మికుంట            30                      159

హుజూరాబాద్         30                      143

చొప్పదండి            14                       64

పెద్దపల్లి                 36                        157

మంథని                  13                      48

సుల్తానాబాద్           15                     139

వేములవాడ            28                    113

సిరిసిల్ల                  39                       170

జగిత్యాల               50                        254

కోరుట్ల                   33                        150

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి              26                       150

రాయికల్               12                       48

ధర్మపురి                 15                      52