పారాలింపిక్స్ సంబురం సమాప్తం

పారాలింపిక్స్ సంబురం సమాప్తం

పారిస్‌‌‌‌: వైకల్యాన్ని అధిగమించి ఆటల్లో అద్భుతాలు చేసిన పారా అథ్లెట్ల పండుగ పారాలింపిక్స్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ ముగిసింది. పారిస్‌‌‌‌లో ఆదివారం అర్ధరాత్రి  జరిగిన ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పారా అథ్లెట్లు తమ జెండాలు చేతబట్టుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇండియా తరఫున పారా ఆర్చర్‌‌‌‌‌‌‌‌, గోల్డ్ మెడలిస్ట్ హర్వీందర్ సింగ్‌‌‌‌, రెండు కాంస్యాలు గెలిచిన అథ్లెట్ ప్రీతి పాల్‌‌‌‌ త్రివర్ణ పతాకంతో నడిచారు. పారాలింపిక్‌‌‌‌  జెండాను 2028లో ఆతిథ్యం ఇచ్చే లాస్ ఏంజిల్స్‌‌‌‌కు అందజేయడంతో వేడుకలు ముగిశాయి.