
పాక్ చీఫ్ జస్టిస్ అధికారాలకు కళ్లెం
బిల్లును పాస్ చేసిన ఆ దేశ పార్లమెంట్
ఇస్లామాబాద్ : సుమోటో కేసులు, కాన్ స్టిట్యూషన్ బెంచెస్ వంటి విషయాల్లో పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ అధికారాలకు కళ్లెం వేసేందుకు ఆ దేశ పార్లమెంటు ఓ బిల్లును పాస్ చేసింది. ‘ద సుప్రీం కోర్ట్ (ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్) బిల్ 2023’ ను న్యాయ శాఖ మంత్రి ఆజం నజీర్ తారర్ బుధవారం నేషనల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకుముందు ఆ బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. సీజే అధికారాలకు కత్తెరవేసేలా చట్టాలు చేయకపోతే చరిత్ర తమను క్షమించదని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంతకుముందు ఎంపీలకు చెప్పారు. ఆయన అలా వ్యాఖ్యానించిన ఒక రోజు తర్వాతే పార్లమెంటులో ఈ బిల్లు పాస్ అయింది.