బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రాంగణాలకు ప్రముఖుల పేర్లు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రాంగణాలకు ప్రముఖుల పేర్లు

హైదరాబాద్ : తెలంగాణలో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఆ పార్టీ నాయకులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమావేశాలను సక్సెస్ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. HICCలో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రాంగణాలకు ఆ పార్టీ నాయకులు ప్రముఖ నేతల పేర్లు కూడా పెట్టారు. 

                ప్రాంగణం                                                    పేరు

హెచ్ఐసీసీ నొవాటెల్                                                             :   శాతవాహన నగర్ పేరు 
జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హాల్                           :   కాకతీయ ప్రాంగణం
అతిథులు బస చేసే ప్రాంగణం                                             :   సమ్మక్క -సారలమ్మ నిలయం
3న పేరేడ్ గ్రౌండ్ లో జరిగే మోడీ సభ                                     :  ‘విజయ సంకల్ప సభ’ అని పేరు
మీడియా పాయింట్                                                                 :  సోయాబుల్లాఖాన్ పేరు
జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయం                          :  భక్త రామదాసు పేరు
బీజేపీ ఫుల్ టైమర్  వర్కర్స్ సమావేశం                                 :  కొమురం భీం పేరు
భోజనశాల ప్రాంగణం                                                               :   భాగ్యరెడ్డి వర్మ
జాతీయ కార్యవర్గ సమావేశాల తీర్మాణాల ప్రాంగణం            :   నిజాంపై పోరాటం చేసిన ‘నారాయణ పవార్’ పేరు
జాతీయ ప్రధాన కార్యదర్శులు నిర్వహించే మీటింగ్ హాలు :   వందేమాతరం రామచంద్రరావు

జూలైలో 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు, సీఎంలు, పార్టీ ముఖ్య నేతలు రానున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర బలగాలతో పాటు 8 వేల మంది రాష్ట్ర పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. దాదాపు 1,600 సీసీ కెమెరాలతో సిటీ మొత్తం నిఘా పెట్టారు. ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మరింత పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.