మా ఊరికి ఏం చేశారు.?మంత్రి తలసానిని నిలదీసిన గ్రామస్తులు

మా ఊరికి ఏం చేశారు.?మంత్రి తలసానిని నిలదీసిన గ్రామస్తులు
  • మంత్రి తలసాని ప్రోగ్రాంలో సూర్యాపేట జిల్లా ఆకుపాముల వాసుల ఆందోళన

సూర్యాపేట/మునగాల, వెలుగుమంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​కు నిరసన సెగ తగిలింది. తమ ఊరికి ప్రభుత్వం ఏం చేసిందని ఆయనను జనం నిలదీశారు. శనివారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో ఉచిత మెగా పశువైద్య శిబిరం, గొర్రెలు మేకల ఆరోగ్య శిబిరం, మేలు జాతి దూడల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా ఊరిని ఏం అభివృద్ధి చేశారని ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు అట్లనే ఉంది. ఎవరూ పట్టించుకోవడం లేదు” అని మండిపడ్డారు. వారిని అక్కడి నాయకులు వారించారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

బీజేపోళ్లకు ధైర్యం ఉంటే కేసీఆర్​ను జైలుకు పంపండి: తలసాని

రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతామంటే తాము ఊరుకునేది లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  హెచ్చరించారు. ఆకుపాముల గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ‘‘బీజేపోళ్లు కేసీఆర్ ప్రభుత్వంపై కేసులు వేస్తమంటున్నరు. జైలుకు పంపుతమంటున్నరు. మీకు దమ్ముధైర్యం ఉంటే పంపించండి” అంటూ తలసాని సవాల్
విసిరారు.