లిక్కర్ ధరలు తగ్గించి అమ్మకాలు పెంచాలని ప్లాన్

లిక్కర్ ధరలు తగ్గించి అమ్మకాలు పెంచాలని ప్లాన్
  • లిక్కర్ రేట్ల తగ్గింపు!
  • ప్రభుత్వానికి ఆబ్కారీ శాఖ ప్రతిపాదనలు 
  • ధరలు తగ్గించి అమ్మకాలు పెంచాలని ప్లాన్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో లిక్కర్‌‌‌‌ రేట్లు స్వల్పంగా తగ్గనున్నాయి. ఆ దిశగా ఆబ్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. సర్కారు నుంచి ఆమోదం వస్తే కొత్త రేట్లు అమల్లోకి వచ్చే ఛాన్స్‌‌‌‌ ఉంది. బీరు మినహా ఇండియాలో తయారయ్యే లిక్కర్(ఐఎంఎల్)​బాటిళ్లపై స్వల్పంగా ధర తగ్గించడం ద్వారా అమ్మకాలు పెంచాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. రాష్ట్రంలో 2,620 వైన్స్‌‌‌‌తోపాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లు ఉన్నాయి. వీటికి మద్యం డిపోల నుంచి సరుకు రవాణా అవుతోంది. 2020 మే నెలలో కరోనా సెస్‌‌‌‌ పేరుతో ప్రభుత్వం 20 శాతం వరకు లిక్కర్‌‌‌‌ రేట్లు పెంచింది. అయితే అన్ని రాష్ట్రాల్లో రేట్లు పెంచి, ఆ తర్వాత తగ్గించినా మన దగ్గర మాత్రం తగ్గించలేదు. ఇటీవలి కాలంలో బీర్ల సేల్‌‌‌‌ తగ్గడంతో ఒక్కో బాటిల్‌‌‌‌పై రూ.10 తగ్గించారు. కానీ ఐఎంఎల్‌‌‌‌పై మాత్రం అవే ధరలు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అధిక ధరలు ఉన్నాయి. అయితే రేట్లు అధికంగా ఉండటంతో గతంతో పోలిస్తే ఆదాయం పెరిగినప్పటికీ మద్యం అమ్మకాలు కొంత మందగించాయి. ఈ నేపథ్యంలో స్వల్పంగా ధరలు తగ్గించాలని ఎక్సైజ్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ భావిస్తోంది. ఎంత మేర తగ్గిస్తే ఎంత ఆదాయం వస్తుందో అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఒక్కో బాటిల్‌‌‌‌పై రూ.10 వరకు తగ్గించనున్నట్లు తెలిసింది. ఏ బాటిల్‌‌‌‌ కొన్నా.. అంటే క్వార్టర్‌‌‌‌, హాఫ్‌‌‌‌, ఫుల్‌‌‌‌ అనే తేడా లేకుండా అన్నింటిపై ఇదే వర్తింపజేయాలని ఆలోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను అధికారులు ఇటీవల సర్కారుకు పంపించారు. అయితే ప్రభుత్వం దీనికి గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇవ్వాల్సి ఉంది. 

టార్గెట్‌‌‌‌ రూ. 33 వేల కోట్లు..
ప్రస్తుత మార్చి నెలతో 2021–22 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి దాకా రూ. 28 వేల కోట్ల దాకా లిక్కర్‌‌‌‌ సేల్స్‌‌‌‌ జరిగాయి. ఈ నెలతో సుమారుగా రూ.30 వేల కోట్లు రీచ్‌‌‌‌ అయ్యే చాన్స్‌‌‌‌ ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 27 వేల కోట్ల లిక్కర్‌‌‌‌ మాత్రమే అమ్ముడైంది. అంటే సుమారు రూ. 3 వేల కోట్లు అధికంగా ఆదాయం సమకూరుతోంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ.3 వేల కోట్ల దాకా అదనంగా రాబట్టాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. మొత్తంగా రూ. 33 వేల కోట్లను టార్గెట్‌‌‌‌గా నిర్దేశించుకున్నట్లు సమాచారం.