పురుగుల మందు బదులు గడ్డి మందు కొట్టిన్రు

పురుగుల మందు బదులు గడ్డి మందు కొట్టిన్రు

యాదగిరిగుట్ట, వెలుగు: పురుగుల మందు బదులు గడ్డి మందు స్ప్రే చేయడంతో నర్సరీలోని 1,500 మొక్కలు చనిపోయాయి. ఎంపీడీవో ఉమాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని నర్సరీలో పెంచుతున్న మొక్కలకు పురుగు పట్టింది. నర్సరీలో పనిచేస్తున్న వనసేవక్ విషయాన్ని విలేజ్ సెక్రటరీ ఆంజనేయులు దృష్టికి తీసుకెళ్లాడు. గ్రామపంచాయతీ బిల్డింగ్ లో పురుగుల మందు ఉందని, తీసుకెళ్లి స్ప్రే చేయమని ఆంజనేయులు చెప్పాడు. వనసేవక్ పొరపాటున పురుగుల మందు పక్కన ఉన్న గడ్డి మందు డబ్బాను తీసుకెళ్లి నర్సరీలో మొక్కలకు స్ప్రే చేశాడు. దీంతో మూడు బెడ్స్​లోని మొక్కలు ఎండిపోయాయి. ఒక్కో బెడ్​లో వెయ్యి మొక్కలు ఉంటాయని, దాదాపు 1500 మొక్కలు ఎండిపోయాయని ఎంపీడీవో చెప్పారు. ఉన్నతాధికారులకు రిపోర్ట్ సమర్పించామని, వారి ఆదేశాల ప్రకారం సంబంధిత ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.