శ్రీరామ శోభాయాత్రకు ఫుల్ సెక్యూరిటీ

శ్రీరామ శోభాయాత్రకు ఫుల్ సెక్యూరిటీ
  • ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్‌‌‌‌ నుంచి ప్రారంభం 
  • కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనున్న యాత్ర
  • రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్లు
  • 3 కమిషనరేట్లలో 24 గంటల పాటు వైన్స్ బంద్

హైదరాబాద్,వెలుగు: శ్రీరామ నవమి శోభయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీతారాంబాగ్‌‌‌‌ నుంచి కోఠి హనుమాన్‌‌‌‌ వ్యాయామశాల వరకు జరిగే శోభాయాత్రకు 5 వేల మంది పోలీసులు, 350 సీసీ  కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.  బందోబస్తుపై సిటీ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌ శనివారం రివ్యూ మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. లా అండ్‌‌‌‌ ఆర్డర్, ట్రాఫిక్‌‌‌‌, టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌, స్పెషల్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌ అధికారులతో సమీక్ష చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌లోని 3  కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.

6.5 కిలోమీటర్లు..
సీతారాంబాగ్‌‌‌‌లో  శ్రీరామాలయం నుంచి ఉదయం 11గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో  10 వేల మంది భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.  మొత్తం 6.5 కిలోమీటర్లు యాత్ర సాగనుంది. బోయిగూడ కమాన్, మంగళ్ హాట్, జాలీ హనుమాన్, దూల్ పేట్, పురాణపూల్, గాంధీ విగ్రహం, జుమ్మెరాత్ బజార్, చుడీ బజార్, బేగంబజార్ ఛత్రి, సిద్ధి అంబర్ బజార్, గౌలిగూడ చమన్, గురుద్వార్, పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, కోఠి సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయామ శాలకు ర్యాలీ చేరుకోనుంది. రాత్రి 10 గంటలలోపు ర్యాలీ ముగించేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే రూట్‌‌‌‌లో ర్యాలీ మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌కు అనుగుణంగా ట్రాఫిక్ డైవర్షన్స్ చేయనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రధాన ఊరేగింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిర్దేశించిన రూట్లలో వాహనదారులు వెళ్లాలని సూచించారు.

ట్రాఫిక్ డైవర్షన్స్‌‌‌‌  ఇలా..

  • అసిఫ్ నగర్ నుంచి వచ్చే వాహనదారులు మల్లేపల్లి క్రాస్ రోడ్స్ నుంచి విజయనగర్ కాలనీ, మెహిదీపట్నం వైపు వెళ్లాలి. 
  • బోయిగూడ కమాన్ నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే వాహనాలు ఆగాపురా, హబీబ్‌‌‌‌నగర్  మీదుగా వెళ్లాలి.
  • ఆగాపురా, హబీబ్‌‌‌‌నగర్ నుంచి సీతారాంబాగ్ మార్గంలో వచ్చే ట్రాఫిక్​ను దారుసలాం మీదుగా మళ్లించనున్నారు.
  • బోయిగూడ కమాన్ నుంచి పురానాపూల్ వెళ్లే వాటిని దారుసలాం మీదుగా మళ్లించనున్నారు.
  • పురానాపూల్ నుంచి గాంధీ విగ్రహం వైపు వచ్చే వెహికల్స్ పేట్లబురుజు, కార్వాన్, కుల్సుం పురా వైపు వెళ్లాల్సి ఉంటుంది.
  • ఎంజే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వెహికల్స్​ను జుమ్మెరాత్ బజార్ వైపు, సిటీ కాలేజీ, అఫ్జల్‌‌‌‌గంజ్ వైపునకు మళ్లించనున్నారు. 
  • మాలకుంట నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వెహికల్స్  దారుసలాం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 
  • అఫ్జల్‌‌‌‌గంజ్ నుంచి సిద్ధి అంబర్‌‌‌‌ బజార్ రూట్​లో వచ్చే వెహికల్స్  సాలార్ జంగ్ బ్రిడ్జి వద్ద మళ్లించనున్నారు.
  • రంగ్‌‌‌‌ మహల్, కోఠి నుంచి గౌలిగూడ చమన్ వైపు వెళ్లే వెహికల్స్ ను జాంబాగ్, ఎంజే మార్కెట్ వద్ద మళ్లించనున్నారు.
  • అఫ్జల్‌‌‌‌గంజ్ నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వచ్చే వెహికల్స్​ను మదీనా, సిటీ కాలేజీ వైపు మళ్లించనున్నారు.

అఫ్జల్ గంజ్,కోఠి పరిసర ప్రాంతాల్లో ఇలా..

  • అఫ్జల్ గంజ్ నుంచి కోఠి వచ్చే వెహికల్స్ ను సెంట్రల్ లైబ్రరీ, సాలార్ జంగ్ మ్యూజియం వైపు మళ్లించనున్నారు.
  • రంగ్ మహల్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను సీబీఎస్ వైపు మళ్లించనున్నారు.
  • బ్యాంక్ స్ట్రీట్ నుంచి పుత్లిబౌలి వైపు ట్రాఫిక్ ను అనుమతించరు.
  • చాదర్ ఘాట్ బ్రిడ్జి, సాయి బాబా టెంపుల్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను నింబోలి అడ్డా వైపు మళ్లించనున్నారు.
  • నారాయణగూడ, కాచిగూడ నుంచి వచ్చే వెహికల్స్ కాచిగూడ స్టేషన్ రోడ్ మీదుగా మళ్లింపు.
  • చర్మాస్ నుంచి వచ్చే వెహికల్స్ ను ఎంజే మార్కెట్, నాంపల్లి స్టేషన్ రోడ్​లో మళ్లించనున్నారు.
  • అబిడ్స్ జీపీవో నుంచి బ్యాంక్ స్ట్రీట్ వైపు వెహికల్స్​కు అనుమతి లేదు. 
  • తిలక్ రోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్​ను రామ్ కోఠి వైపు మళ్లించనున్నారు.