కానిస్టేబుల్ పరీక్ష ప్రశ్నల్లో గందరగోళం!

 కానిస్టేబుల్ పరీక్ష ప్రశ్నల్లో గందరగోళం!

ప్రభుత్వం ఎంతో పకడ్బంధీగా ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ ప్రశ్నాపత్రంలో తప్పులున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు స్పందించింది. కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్ లోని ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు జరుగుతోన్న వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సెట్ D లో 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు రిక్రూట్మెంట్ బోర్డ్ కు ఫిర్యాదులు అందాయని ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తామని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది.

సోషల్  మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులకు రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. నిపుణుల కమిటీతో చర్చించి వారు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వివరణ వచ్చేంతవరకు వదంతులు నమ్మొద్దని  శ్రీనివాసరావు పేర్కొన్నారు.