రాంగోపాల్​పేట చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. విచారణలో విస్తు పోయే నిజాలు

రాంగోపాల్​పేట చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. విచారణలో విస్తు పోయే నిజాలు

హైదరాబాద్​లోని రాంగోపాల్ పేట సింధి కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును చేధించారు పోలీసులు.  ముగ్గురు నేపాలీలను అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు.  ఈ మధ్య కాలంలో ఇదే పెద్ద దోపిడి అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 

ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ నేపాలీలను పనిలో పెట్టినట్లు చెప్పారు.  వీరు  ఐదేళ్లుగా వ్యాపారి ఇంట్లో నమ్మకంగా పనిచేసి చోరీ చేశారని చెప్పారు.  తర్వాత  రూ.5 కోట్ల విలువ చేసే  బంగారు ఆభరణాలు, రూ.49 లక్షలు చోరీ చేశారని వెల్లడించారు.  18 గడియారాలు, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

వివరాలిలా ఉన్నాయ్..

రాంగోపాల్​పేటలోని ఓ ఇంట్లో ఈ నెల 9న భారీ దొంగతనం జరిగింది. యజమాని కంప్లెంట్​ మేరకు టాస్క్ ఫోర్స్​, నార్త జోన్​ పోలీసులు రంగంలోకి దిగారు. పది రోజుల పాటు దొంగతనం చేసిన వారిని కనుక్కునేందుకు ప్రయత్నించారు. 

చివరికి దొంగలు దొరికారు.నేపాల్​కి చెందిన శంకర్​కమల్​కుటుంబం రాహుల్ గోయల్​ ఇంట్లో వాచ్​మెన్​గా అయిదేళ్లుగా పని చేస్తున్నారు. ఓనర్​కి బిజినెస్​ ఉంది. 

శంకర్ కి మరికొందరు తోడుగా వచ్చి పథకం ప్రకారం ఇళ్లు లూటీ చేశారు. దొరకినకాడికి దోచుకుని పరారయ్యారు. డబ్బు సంచులు, బంగారంతో మహారాష్ట్ర పుణేకు వెళ్లారు. అక్కడి నుంచి మూడు గ్రూపులుగా విడిపోయారు. పుణె, గుజరాత్, ముంబైల నుంచి నిందితులు ఇండో నేపాల్​ సరిహద్దుకు చేరుకున్నారు. 

బార్డర్​ దాటకుండా చర్యలు..

నిందితులు బార్డర్​ దాటకుండా డీసీపీ చందనా దీప్తి ఎస్​ఎస్​ బీ సాయం తీసుకున్నారు. బార్డర్​ దాటడానికి ప్రయత్నించగా అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వెహికిల్​ని తనిఖీ చేయగా వారు పట్టుబడ్డారు. 

నిందితులలో కమల్, పార్వతి, సునీల్, మోహన్​సౌద్​ఉన్నారు.  వీరి నుంచి మొత్తం సొత్తు రికవరీ చేసినట్లు డీసీపీ చెప్పారు. లాక్​ బ్రేక్​ చేసిన భరత్​అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అతని దగ్గర మరి కొంత నగదు ఉందని పోలీసులు తెలిపారు.