లిక్కర్ తో పోటీపడుతున్నగుడుంబా..లీటర్ రూ.700

లిక్కర్ తో పోటీపడుతున్నగుడుంబా..లీటర్ రూ.700

మంచిర్యాల/ ఆసిఫాబాద్​, వెలుగుమార్చి 22 నుంచి వైన్స్, బార్లు మూతపడ్డాయి. బయట మద్యం దొరకడం కష్టంగా మారింది. దీంతో మందుబాబులు చవకగా దొరికే గుడుంబాకు అలవాటుపడుతున్నారు. ఆదిలాబాద్‌‌‌‌ ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్ల క్రితం నాటుసారా అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగేవి. ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేయడంతో అది తాగేవారంతా లిక్కర్ ​వైపు మళ్లారు. కానీ కరోనా లాక్​డౌన్ నేపథ్యంలో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది.  నాలుగు జిల్లాల్లోని పట్టణ ప్రాంతాలు మినహా పలు మండలాల్లో నాటుసారా తయారు చేస్తున్నారు. బైక్‌‌‌‌లు, ఆటోల ద్వారా దొంగచాటుగా పట్టణాలకు సరఫరా చేస్తున్నారు.  మంచిర్యాల జిల్లా కేంద్రానికి హాజీపూర్​మండలం గడ్‌‌‌‌పూర్, మందమర్రి మండలం పులికుంట, దండేపల్లి మండలం లింగాపూర్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గుడుంబా వస్తోంది. కొన్ని చోట్ల మందుబాబులే గుడుంబా కోసం గ్రామాల బాటపడుతున్నారు.

మోతాదు మించితే ప్రమాదకరం..

నల్లబెల్లం, పటికతోపాటు కొన్ని రకాల రసాయనాలను పులియబెట్టి గుడుంబాను తయారు చేస్తారు. పటిక లేకుంటే అమ్మోనియా, యూరియా కలుపుతారు. వీటి మోతాదు మించితే ప్రాణాలకే ప్రమాదకరం. అయినప్పటికీ చాలామంది ఈ గుడుంబాను తాగుతున్నారు. ఇదివరకు ప్రీమియం లిక్కర్​ తాగిన కొంతమంది కూడా కూల్​డ్రింకుల్లో కలుపుకొని తాగుతున్నట్లు ఎక్సైజ్​ఆఫీసర్ల పరిశోధనలో తేలింది.

వందలాది కేసులు..

గుడుంబా నియంత్రణపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. మంచిర్యాల జిల్లాలో గత నెల రోజుల్లో వందకుపైగా కేసులు బుక్​ చేశారు. సుమారు 450 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. 5,050 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. మొత్తం 95 మందిని అరెస్టు చేసి, 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జన్నారం మండలం నుంచి పులిమడుగుకు మూడున్నర క్వింటాళ్ల పటికను తరలిస్తుండగా మంచిర్యాల ఎక్సైజ్​ఆఫీసర్లు పట్టుకున్నారు.

  • ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లాలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన తిర్యాణి, రెబ్బెన, దహేగాం, కౌటాల, బెజ్జూర్, సిర్పూర్ టి , ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి మండలాల్లో గుడుంబా దందా జోరుగా సాగుతోంది. ఎవరికీ డౌట్ రాకుండా పంట పొలాల్లో, అటవీ ప్రాంతంలో, టాయిలెట్‌‌‌‌ రూమ్‌‌‌‌లలో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్నారు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ నుంచి ఇప్పటి వరకు 33 కేసులు నమోదు చేసిన ఆఫీసర్లు ఏడు వాహనాలను సీజ్‌‌‌‌ చేశారు. 3,200  లీటర్లు ధ్వంసం చేశారు.
  • ర్మల్‌‌‌‌ జిల్లాలోని కడెం ఖానాపూర్ పెంబి, రాజురా, సారంగాపూర్, భైంసా తదితర మండలాల్లో గుడుంబా తయారు చేస్తునారు. ఎక్సైజ్ ఆఫీసర్లు ఇప్పటివరకు 15 – కేసులు నమోదు చేశారు.
  • ఆదిలాబాద్​ జిల్లాలోని బోథ్​, భీంపూర్,  తలమడుగు, ఆదిలాబాద్​రూరల్,  బజార్​హత్నూర్,  సిరికొండ, నార్నూర్  తదితర మండలాల్లో  గుడుంబా ఎక్కువగా తయారు చేస్తున్నారు.  ఇటీవల పలు మండలాల్లో దాడులు నిర్వహించిన ఎక్సైజ్‌‌‌‌ ఆఫీసర్లు 25 కేసులు నమోదు చేశారు.  ఆఫీసర్లు ఈ దాడులు పెంచి గుడుంబాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.