వాన నీళ్లతోనే ప్రాజెక్టులు ఫుల్

వాన నీళ్లతోనే ప్రాజెక్టులు ఫుల్

ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న కీలక ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయి. ఎగువన మహారాష్ట్ర నుంచి వస్తున్న ఫ్లడ్ తో ఎస్సారెస్పీకి జలకళ వచ్చింది. ప్రాజెక్టులోకి ఇప్పటికే 54 టీఎంసీల నీరు చేరింది. ఇక ఎల్లంపల్లితో పాటు కాళేశ్వరంలో భాగమైన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ రిజర్వాయర్లన్నీ పూర్తిస్థాయిలో నిండాయి. దీంతో గేట్లు ఎత్తి వరదనీటిని కిందికి వదులుతున్నారు. అటు మిడ్మానేర్, లోయర్ మానేరు డ్యామ్లు కూడా ఫుల్ లెవల్కు చేరుకున్నాయి. ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే ఈ రెండు ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లు ఎత్తే చాన్స్ ఉందని ఆఫీసర్లు అంటున్నారు. అటు కృష్ణా నది పరవళ్లు తొక్కుతుండడంతో జూరాల నిండిపోయింది. దీని కెపాసిటీ తక్కువ కావడంతో కేవలం 5 టీఎంసీలను మాత్రమే నిల్వ ఉంచుతూ మిగిలిన వరదను ఎప్పటికప్పుడు శ్రీశైలం వైపు వదిలిపెడుతున్నారు. ప్రాజెక్టు లన్నీ వర్షా ల వల్లే నిండడంతో కాళేశ్వరం లిఫ్టు లకు ఈ ఏడాదికి ఇక రెస్టే అని ఇంజినీర్లు చెబుతున్నారు.

తెలంగాణలో మాటలు తప్ప చేతల్లేవ్..టెస్టుల సంఖ్య పెంచలే