
సిటీలో మంగళవారం రాత్రి 8 గంటల తర్వాత చిన్నగా మొదలైన వాన అర్ధరాత్రి వరకు దంచికొట్టింది. చందానగర్, మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకి ప్రాంతాల్లో భారీ వానకు రోడ్లపై నీరు నిలిచింది. దీంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. మెహిదీపట్నం, గోల్కొండ, అల్వాల్, శామీర్పేట ప్రాంతాల్లో వర్షం పడింది. కాప్రాలో అత్యధికంగా 3.6 సెం.మీలు కురిసింది. మరో రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. – వెలుగు, హైదరాబాద్