విరాట్ కోహ్లీ ‘జెర్సీ నెంబర్ 18’ వెనుక అసలు కథ

విరాట్ కోహ్లీ ‘జెర్సీ నెంబర్ 18’ వెనుక అసలు కథ

క్రికెట్ లో జెర్సీ నెంబర్ 18 అనగానే గుర్తొచ్చే పేరు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరు. ఏ ఫార్మట్ లో చూసినా విరాట్ నెంబర్ 18 జెర్సీనే ధరిస్తాడు. అండర్ 19 నుంచి ఈ జెర్సీనే వేసుకుంటాడు. అయితే, ఈ జెర్సీ వెనుక ఉన్న కథను స్వయంగా తనే వివరించాడు. జెర్సీ గురించి విరాట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తనేప్పుడూ జెర్సీ నెంబర్ 18 కావాలని అడగలేదని.. యాదృశ్చికంగా తనకు ఆ జెర్సీ నెంబర్ కనెక్ట్ అయిందని చెప్పుకొచ్చాడు. ‘నేనుప్పుడూ  నా జెర్సీ నెంబర్ 18 కావాలని అడగలేదు. నా మొదటి అండర్ 19 జెర్సీ నెంబర్ 44 ఇచ్చారు. తర్వాత 18కి మార్చారు. మా నాన్న చనిపోయిన తేదీ డిసెంబర్ 18. అంతేకాదు, నేను టీమిండియా తరుపున అరంగేట్రం చేసింది ఆగస్టు 18న. అయితే, నేను అరంగేట్రం చేసిన టైంలో జెర్సీ నెంబర్ 18 ఖాళీగా ఉంది. దాంతో నాకు ఆ నెంబర్ ను కేటాయించారు. నా లైఫ్ లో 18 నెంబర్ కి ప్రత్యేక స్థానం ఉంది. అది నాతో నిలిచిపోయింది’ అని విరాట్ అన్నాడు.