
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల భర్తీ తుది దశకు చేరుకుంది. ఇటీవలే తుది రాత పరీక్షల ఫలితాలను టీఎస్ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసింది. తుది రాతపరీక్ష ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. తుది ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు టీఎస్ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ లెటర్లు 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రాలు..
* ఆదిలాబాద్ – ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ గ్రౌండ్, ఎస్‌పీ ఆఫీసు
* సైబరాబాద్ – సీటీసీ, సీపీ ఆఫీసు, గచ్చిబౌలి
* హైదరాబాద్ – శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియం, గోషామహల్, హైదరాబాద్
* కరీంనగర్ – పోలీసు హెడ్ క్వార్టర్స్, కరీంనగర్
* ఖమ్మం – సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్, ఖమ్మం
* కొత్తగూడెం – సీఈఆర్ క్లబ్, ప్రకాశ్ స్టేడియం, కొత్తగూడెం
* మహబూబాబాద్ – డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు, సబ్ జైల్ దగ్గర, మహబూబాబాద్
* మహబూబ్‌నగర్ – డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్, మహబూబ్‌నగర్
* నాగర్‌కర్నూల్ – డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీస్, నాగర్‌కర్నూల్
* గద్వాల్ – డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు, జోగులాంబ గద్వాల
* నల్లగొండ – డార్మెటరీ హాల్, పోలీసు హెడ్ క్వార్టర్స్, నల్లగొండ
* నిజామాబాద్ – పోలీస్ పరేడ్ గ్రౌండ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, నిజామాబాద్
* రాచకొండ – సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, అంబర్‌పేట్, హైదరాబాద్
* రామగుండం – సీపీ ఆఫీసు, రామగుండం
* సంగారెడ్డి – పోలీసు పరేడ్ గ్రౌండ్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్, సంగారెడ్డి
* సిద్దిపేట – పోలీసు కమిషనరేట్, సిద్దిపేట
* సూర్యాపేట – డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు, సూర్యాపేట
* వరంగల్ – సీపీ ఆఫీసు, వరంగల్