కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం

కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం
  • కేంద్రం, తయారీ సంస్థ నష్టపరిహారం ఇవ్వాలి
  • అవేకెన్​ ఇండియా మూమెంట్ ప్రతినిధుల డిమాండ్ 

ఖైరతాబాద్​,వెలుగు: కరోనా సమయంలో​ఎమర్జెన్సీ పేరుతో క్లినికల్​ట్రయిల్స్​ లేకుండానే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో వ్యాక్సిన్​ వేసుకున్న వారిలో దుష్ప్రభావం ఇప్పటికీ ఉందని అవేకెన్​ ఇండియా మూమెంట్ సలహాదారు దొంతి నరసింహారెడ్డి,​ స్టీరింగ్ కమిటీ సభ్యురాలు సరస్వతి కవుల, డాక్టర్లు సుధ, సక్సేనా,  సురేందర్ రాజు ఆరోపించారు. సోమవారం సోమాజిగూడ  ప్రెస్​క్లబ్​లో  మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 

కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో గుండెపోటు, క్యాన్సర్, నరాల వ్యాధులు వంటివి వస్తున్నాయన్నారు. ఇప్పటికే చాలామంది మృతి చెందారని, వారికి కేంద్ర ప్రభుత్వంతో పాటు వ్యాక్సిన్ ​తయారీ సంస్థ  నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వంతో పాటు  వ్యాక్సిన్ ను ​ప్రమోట్​ చేసిన సెలబ్రెటీలు కూడా సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.