- కుర్చీలతో కొట్టుకున్నారు!
- చెన్నారావుపేట సర్పంచ్ ప్రమాణస్వీకారంలో ఘటన
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. బీఆర్ఎస్బలపర్చిన కంది శ్వేత సర్పంచ్‌గా, కాంగ్రెస్మద్దతుతో దొంతి శ్రీనివాస్ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సోమవారం పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
సర్పంచ్మద్దతుదారులు డీజేలో కేసీఆర్పాటలు పెట్టుకుంటూ పంచాయతీ ఆఫీసుకు తరలివచ్చారు. కేసీఆర్పాటలు పెట్టడం సరికాదని కాంగ్రెస్కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వివాదం ముదిరి వేదిక వద్ద ఇరువర్గాలు కుర్చీలతో కొట్టుకున్నారు. కాంగ్రెస్‌నేత వనపర్తి శోభన్, బీఆర్‌ఎస్‌నేత రమేష్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి ఇద్దరిని చికిత్సకోసం నర్సంపేట జనరల్ఆస్పత్రికి తరలించారు.
ఎస్ఐ రాజేష్‌రెడ్డి వెళ్లి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఎంపీడీవో శివానంద్ కొత్త పంచాయతీ పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదు చేశాయని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
