దమ్ముంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలి

దమ్ముంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలి

కోరుట్ల, వెలుగు: సిటిజన్‌‌షిప్‌‌ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్ని టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే కేరళలో చేసినట్లుగా.. సీఏఏను రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దళితులు, మైనార్టీలను అణచివేసేందుకే సీఏఏ తెచ్చిందని ఆరోపించారు. మున్సిపల్‌‌ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందన్నారు. ఆర్టికల్14 ప్రకారం సీఏఏ రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. మతాల ప్రాతిపదికన కాకుండా, ప్రజల ప్రయోజనాల ప్రాతిపదికన చట్టాలు
తేవాలన్నారు.