హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్ ఫలితాలు గురువారం రిలీజ్ కానున్నాయి. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో మధ్యాహనం 3 గంటలకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి ఈ ఫలితాలను విడుదల చేస్తారని ఐసెట్ కన్వీనర్ వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 26, 27న ఐసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే.
