మార్కెట్లోకి ఎన్బీసీ కొత్త ప్రొడక్టులు.. వైపర్ బ్లేడ్లు, బ్రేక్ ప్యాడ్లు, బెల్టులు కొత్త ఉత్పత్తులు

మార్కెట్లోకి ఎన్బీసీ  కొత్త ప్రొడక్టులు.. వైపర్ బ్లేడ్లు, బ్రేక్ ప్యాడ్లు, బెల్టులు కొత్త ఉత్పత్తులు

హైదరాబాద్​, వెలుగు:  వాహనాల బేరింగ్స్ తయారు చేసే నేషనల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  (ఎన్​బీసీ) కొత్త ఆటోమోటివ్ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది.  2, 3 వీలర్లు , ప్యాసింజర్ కార్ల కోసం వైపర్ బ్లేడ్లు, బ్రేక్ ప్యాడ్లు, బెల్టులు, స్టీరింగ్ రాడ్లతో పాటు ఇతర వాహన విడిభాగాలను ప్రవేశపెట్టింది. దేశంలో వాహనాల సంఖ్య పెరగడం, వాటి జీవిత కాలం ఎక్కువ కావడం వల్ల మార్కెట్లో నాణ్యమైన విడిభాగాలకు డిమాండ్ పెరిగిందని కంపెనీ తెలిపింది.  ఇవి దేశవ్యాప్తంగా ఉన్న విస్తృత పంపిణీ నెట్‌‌వర్క్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.