హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కె.విద్యాసాగర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహించిన దివ్యదేవరాజన్ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి సమక్షంలో బాధ్యతల బదిలీ జరిగింది.
