జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల పునరుద్ధరణే కీలకం

జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల పునరుద్ధరణే కీలకం
  • అఖిలపక్షం భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది
  • కేంద్ర హోం మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల హోదా పునరుద్ధరణే కీలకమైన మైలు రాయి అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గురువారం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో మూడు గంటలపాటు జరిగిన అఖిలపక్షం భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని ఆయన తెలిపారు. మొత్తం 8 పార్టీలకు చెందిన 14 మంది ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు.  ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై తమ నిబద్ధతను వ్యక్తం చేశారని సమావేశం అనంతరం హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయాల్సి ఉందని నొక్కి చెప్పారు. జమ్మూ & కాశ్మీర్ అన్ని విధాల అభివృద్ధికి  కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. పార్లమెంటులో వాగ్దానం చేసినట్లుగా జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తు చర్చించామని, డీలిమిటేషన్, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే అంశంపై చర్చించామన్నారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం ముఖ్యమైన మైలురాళ్ల వంటివని ఆయన పేర్కొన్నారు.