Pooja Hegde: కొత్త ఎనర్జీతో పూజా హెగ్డే.. భారీ పారితోషికంతో బన్నీ-అట్లీ సినిమాలో రీఎంట్రీ!

Pooja Hegde: కొత్త ఎనర్జీతో పూజా హెగ్డే..  భారీ పారితోషికంతో బన్నీ-అట్లీ సినిమాలో రీఎంట్రీ!

ముంబై భామ పూజా హెగ్దే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలు గొందిందీ ఈ అందాల తార.  అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ తదితర స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడకపోవ డంతో ఈ బుట్టబొమ్మ కెరీర్ లో కొన్ని  సవాళ్లు ఎదురయ్యాయి.  

అయినప్పటికీ ఇండస్ట్రీ నుంచి దూరం కాలేదు. దానికి బదులుగా, స్పెషల్ సాంగ్స్, ప్రత్యేక అపియరెన్స్ చేస్తూ ఒక కొత్త దారిని ఎంచుకుంది. ఈ నిర్ణయం ఇప్పుడు ఆమెకు పెద్ద అవకాశంగా మారుతోంది.  ఇటీవల రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమాలోని 'మౌనిక సాంగ్ తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా పూజా మరోసారి వార్తల్లో నిలుస్తోంది. అల్లు అర్జున్. అట్లీ కాంబోలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ లోని ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఈ బ్యూటీ సుమారు రూ. 5 కోట్ల పారితోషికంగా అందుకుంటుందని కూడా సమాచారం. 

ఇక సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ తో టచ్ లోనే ఉంటోంది.  ఈ ముద్దుగుమ్మ తాజాగా ఫ్రెష్ ఎనర్జీతో.. కొత్త నెలను ఆత్మీయంగా, సేదతీరే భావంతో ఒక క్రేజ్ పొటోను పంచుకుంటూ స్వాగతించింది. ఈ పిక్ పూజా ఒక ఇరుకైన పుడెన్ హాల్వేలో నిలబడి ఉంది. సాఫ్ట్ వైట్ స్వెట్టర్, నేవీ ట్రౌజర్స్, సాదాసీదా వైట్ షూలు ధరించి కనిపించింది. స్మాల్ బ్లాక్ స్లింగ్ బ్యాగ్ తో తన లుక్ కు అందమైన టచ్ ఇచ్చింది. ఈ ఫొటోలకు మూవీంగ్స్ 'టు డిసెంబర్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇస్టా వేదికగా షేర్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)