ఉక్రెయిన్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత

ఉక్రెయిన్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత

వేలాది ప్రాణాలకు ముప్పుందని డబ్ల్యూహెచ్ వో ఆందోళన

జెనీవా: రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కు కొరత ఏర్పడింది. కొన్ని ఆస్పత్రుల్లో ఇప్పటికే ఆక్సిజన్ అయిపోగా, మరికొన్ని ఆస్పత్రుల్లో 24 గంటల్లో అయిపోనుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ వో) తెలిపింది. దీంతో వేలాది మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఉక్రెయిన్​లో మెడికల్ ఆక్సిజన్ అయిపోతంది. యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ప్లాంట్ల నుంచి ఆస్పత్రులకు ఆక్సిజన్ సప్లై కావడంలేదు. కొన్ని ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. ఉత్పత్తికి అవసరమైన జియోలైట్ రవాణా నిలిచిపోవడమే ఇందుకు కారణం” అని చెప్పింది. కరెంట్ కొరత కారణంగానూ ఆస్పత్రుల్లో సేవలపై ప్రభావం పడుతోందంది. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్​కు సాయం చేస్తున్నట్లు పేర్కొంది.