కస్టమర్ తల పగలగొట్టిన సేల్స్ మెన్

కస్టమర్ తల పగలగొట్టిన సేల్స్ మెన్

సభ్యతగా మాట్లాడాలని చెప్పిన కస్టమర్​తో ఓ సేల్స్ మెన్​ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కస్టమర్​ తల పగలగొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్​ హకీంపేటకు చెందిన ఓ మెగా మార్ట్ లో కస్టమర్​ నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి వచ్చాడు. 

ఈ క్రమంలో సేల్స్​మెన్  అసభ్యంగా మాట్లాడాడని  కస్టమర్​యజమానికి చెప్పాడు. ఇరువురి మధ్య గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఆగ్రహానికి గురైన సేల్స్ మెన్​ ఇనుప రాడ్​తో కస్టమర్​ తల పగలగొట్టాడు. ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.