హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్-వి సెకండ్ ఫేజ్ వ్యాక్సిన్లు

హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్-వి సెకండ్ ఫేజ్ వ్యాక్సిన్లు

స్పుత్నిక్-వి సెకండ్ ఫేజ్ వ్యాక్సిన్లు హైదరాబాద్ చేరుకున్నాయి. ఫస్ట్ బ్యాచ్ మే 1న ఇండియాకు చేరుకుంది. రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్స్, గమలేయా రీసెర్చి ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను రూపొందించాయి. స్పుత్నిక్ వ్యాక్సిన్ ను ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ప్రోడ్యూస్ చేయనుంది. జులై నుంచి ఇండియాలో స్పుత్నిక్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎఫికసి ప్రపంచానికి తెలుసన్నారు ఇండియాకు రష్యన్ అంబసిడర్ కుదాషేవ్. 2020 సెకండ్ హాఫ్ నుంచి రష్యాలో సక్సెస్ ఫుల్ గా వ్యాక్సినేషన్ చేస్తున్నామన్నారు. అన్ని రకాల స్ట్రెయిన్స్ పై స్పుత్నిక్ ఎఫెక్టివ్ గా పని చేస్తుందని రష్యన్ స్పెషలిస్టులు గుర్తించారన్నారు. ఇండియాలో  ఏడాదిలో 850 మిలియన్ డోసులు ఉత్పత్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను ఇండియాలో ప్రవేశపెడతామన్నారు.