హైదరాబాద్, వెలుగు: జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) రెండో సీజన్ ఈనెల 7 నుంచి జరగనుంది. వీ6 వెలుగు సహా పది మీడియా సంస్థల జట్లు బరిలో నిలిచిన ఈ లీగ్ ట్రోఫీలను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ వి. చాముండేశ్వరనాథ్, నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (నెక్) ఏజీఎం సంజీవ్ చింతావర్, స్పోర్టివో ఎండీ భరత్ రెడ్డి, ఇండి రేసింగ్ టీమ్ ఓనర్ అభిషేక్ రెడ్డితో కలిసి గురువారం హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్‌సీసీలో ఆవిష్కరించారు.
జర్నలిస్టులను ఇలా ఒకే వేదికపైకి తెచ్చి మీడియా సంస్థలన్నింటితో కలిపి లీగ్ నిర్వహిస్తున్న స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జాట్)ను ఆయన అభినందించారు. టోర్నమెంట్ బెస్ట్ ప్లేయర్‌కు ఎంఎల్ఆర్ మోటర్స్ నుంచి రూ.1.25 లక్షల విలువైన ఈవీ స్కూటర్ గిఫ్ట్‌గా ఇస్తున్నట్టు ప్రకటించారు. దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఐదు రోజుల పాటు పోటీ పడే జట్లకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రిక్ క్లబ్స్ సీఈఓ గణేష్, జూపర్ ఎల్‌ఈడీ డైరెక్టర్ రమేష్, ఎస్‌జాట్ ప్రతినిధులు, పది జట్ల ప్లేయర్లు పాల్గొన్నారు.
