17,291  పోలీస్ జాబ్స్ కు సెలెక్షన్​ ప్రాసెస్​ ఒక్కటే

17,291  పోలీస్ జాబ్స్ కు సెలెక్షన్​ ప్రాసెస్​ ఒక్కటే

రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీస్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలకు టీఎస్​ఎల్​పీఆర్​బీ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల​ చేసింది. కానిస్టేబుల్ (16,027)​, ఎస్​ఐ (587) జాబ్స్​తో పాటు 677 ఎక్సైజ్​, ట్రాన్స్​పోర్ట్​ డిపార్ట్​మెంట్స్​లో మొత్తం 17,291 పోస్టులను పోలీస్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డు భర్తీ చేయనుంది. ఈ పోస్టులన్నింటికి ఈవెంట్స్ సేమ్​ ఉండగా సిలబస్​ కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. సరైన ప్రణాళికతో ప్రిపరేషన్​ కొనసాగిస్తే అనుకున్న ఖాకీ కొలువు కొట్టొచ్చు.  ఉద్యోగ ప్రకటన విడుదలవగానే కొందరు అభ్యర్థులు కోచింగ్​ తీసుకోవాలా? ఎలా ప్రిపేర్​ అవ్వాలి? ఈవెంట్స్​ ఎలా ప్రాక్టీస్​ చేయాలనే గందరగోళంలో ఉన్నారు. సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, సిలబస్​, ఎగ్జామ్​ ప్యాటర్న్​, ప్రిపరేషన్​ వ్యూహాలు తెలుసుకుందాం...

పోలీస్​ రిక్రూట్​మెంట్​ సెలెక్షన్స్​లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రిలిమ్స్​ స్థానంలో 5 కి.మీ. పరుగుపందెం ఉండేది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత శారీరక దారుఢ్యంతో పాటు, మానసిక సామర్థ్యాలపై ప్రధానంగా ఫోకస్​ పెట్టారు. దీంతో 5 కి.మీ పరుగు స్థానంలో ప్రిలిమ్స్​ రాతపరీక్ష నిర్వహించడంతో పోలీస్​ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా పెరిగింది. గ్రూప్స్​, బ్యాంక్, డీఎస్సీ, రైల్వే అభ్యర్థులు పోలీస్​ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. కానిస్టేబుల్​, ఎస్​ఐ పోలీస్​ జాబ్​​ ఏదైనా అందరికి ఈవెంట్స్​ కామన్​గా ఉన్నాయి. దాదాపు అన్ని పోలీస్​ ఉద్యోగాలకు సిలబస్ ఒకేలా ఉంటుంది. పోస్టు స్థాయిని బట్టి ప్రశ్నలు అడిగే విధానం మారుతుంది. ఫిజికల్​ మెజర్​మెంట్​ టెస్ట్, ఫిజికల్​ ఎఫీషియన్సీ టెస్ట్​లో అర్హత సాధిస్తేనే మెయిన్స్​కు క్వాలిఫై అవుతారు కాబట్టి ఈవెంట్స్​ మీద ఫోకస్​ చేయాలి.  గ్రౌండ్​​ ప్రాక్టీస్​ చేసే సమయంలో ఒకేసారి పరుగెత్తకుండా తొలుత 100మీ. తర్వాత 200 మీటర్లు ఇలా రోజూ పెంచుకుంటూ సాధన చేయాలి. లాంగ్​జంప్​, షార్ట్​పుట్​ ప్రాక్టీస్​ చేసే సమయంలో వార్మప్​ ఎక్సర్​సైజ్​ తప్పనిసరి. మే 2వ తేది నుంచి అప్లికేషన్​ ప్రాసెస్​ మొదలవుతుంది. మే 20 వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హత: ఎస్​ఐ అభ్యర్థులు 21 ఏళ్లు నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్​ అభ్యర్థులు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వం అందరికి మూడేళ్ల సడలింపు ఇచ్చింది. 

అప్లికేషన్​ ఫీజు: ఎస్సై పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000.. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.  కానిస్టేబుల్​ పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​

ప్రిలిమ్స్ : ఎస్​ఐ, కానిస్టేబుల్​ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వేర్వేరుగా 200 మార్కులకు ప్రిలిమ్స్​ పరీక్ష మూడు గంటల్లో నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్​ విధానంలో ఉంటాయి. క్వశ్చన్​ పేపర్​ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ఉంటుంది. ఈవెంట్స్​కు అర్హత సాధించాలంటే అన్ని కేటగిరీల అభ్యర్థులు 30శాతం (60 మార్కులు) సాధించాలి. ప్రిలిమ్స్​లో 1/5 నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. 

ఫిజికల్​ మెజర్​మెంట్​ టెస్ట్​: ఓసీ, బీసీ పురుష అభ్యర్థులు 167.6 సెంటీమీటర్ల ఎత్తు, మహిళా అభ్యర్థులు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఎస్సీ, ఎస్టీ పురుష అభ్యర్థులు 160 సెం.మీ, మహిళలు 150 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.  

ఈవెంట్స్: పురుష అభ్యర్థులకు 1600 మీటర్ల పరుగు 7 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేయాలి. ఎక్స్​ సర్వీస్​మెన్​ కేటగిరీల వారికి 9 నిమిషాల 30 సెకండ్ల సమయం ఉంటుంది. మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు 5 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేయాలి. లాంగ్​జంప్​లో పురుషులు 4 మీటర్లు, ఎక్స్​సర్వీస్​మెన్​ అభ్యర్థులు 3.50 మీటర్లు, మహిళలు 2.50 మీటర్లు దూకాలి. షార్ట్​పుట్​లో పురుషులు, ఎక్స్​సర్వీస్​మెన్​లు 7.26 కేజీ బరువును 6 మీటర్ల దూరం విసరాలి. మహిళా అభ్యర్థులు 4 కేజీల బరువు 4 మీటర్లు విసరాలి. 

మెయిన్స్​ 

ఫిజికల్​ ఎఫిషియెన్సీ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్​ పరీక్ష నిర్వహిస్తారు. తుది రాతపరీక్షలో ఓసీలకు 40శాతం, బీసీలకు 35శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్​ సర్వీస్​మెన్​లకు 30 శాతం మార్కులు వస్తే అర్హత సాధిస్తారు. ఎస్​ఐ మెయిన్స్​లో 1/4 వంతు నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. ఎస్​ఐ మెయిన్స్​లో తెలుగు, ఇంగ్లిష్​ కేవలం అర్హత పరీక్షలు మాత్రమే ఆ మార్కులను ఫైనల్​ సెలెక్షన్స్​లో కలపరు.

​సిలబస్​

ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌: ఇది కేవలం ఎస్ఐ పరీక్ష రాసే వారికి అర్హత పరీక్షగా ఉంటుంది. వృత్తిరీత్యా పై అధికారులకు సమాచారాన్ని చేరవేసే క్రమంలో మెయిల్స్‌‌‌‌‌‌‌‌, లెటర్లు (లేదా) వివిధ అప్లికేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థి ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి. గ్రామర్‌‌‌‌‌‌‌‌, సెంటెన్స్‌‌‌‌‌‌‌‌ అరేంజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, ఆర్టికల్స్‌‌‌‌‌‌‌‌, ప్రిపొజిషన్స్‌‌‌‌‌‌‌‌, హెల్పింగ్‌‌‌‌‌‌‌‌ వెర్బ్స్‌‌‌‌‌‌‌‌,  ట్రాన్స్​లేషన్​పై ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ వార్తలు విని, వాటిని అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
తెలుగు: క్వాలిఫయింగ్​ పేపర్​గా ఎస్​ఐ పరీక్ష రాసే అభ్యర్థులకు మెయిన్స్​లో ఉంటుంది. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌, ఫిర్యాదు, పంచనామా, పై అధికారులకు వివిధ కేసులకు సంబంధించిన నివేదికలను అందించడం పోలీసు వృత్తిలో భాగం కాబట్టి తెలుగు భాషపై అభ్యర్థుల కనీస అవగాహన పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. ఆబ్జెక్టివ్‌‌‌‌‌‌‌‌ విధానంలో సంధులు, సమాసాలు, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, ఖాళీలు పూరించడం, తప్పు పదాలు సరిచేయడం వంటివి వస్తాయి.

జనరల్‌‌‌‌‌‌‌‌ స్టడీస్‌‌‌‌‌‌‌‌

జనరల్​ స్టడీస్​లో భాగంగా కరెంట్​ ఎఫైర్స్​ నుంచి అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయిలో జరిగిన మార్పులపై దృష్టి సారించాలి. కరోనా వైరస్, ఉక్రెయిన్​–రష్యా యుద్ధం, యూఎన్​ఓ లాంటి అంతర్జాతీయ సంస్థల ప్రాముఖ్యత, క్రీడలు, పర్యావరణ ఒప్పందాలు గురించి తెలుసుకోవాలి.  భారతదేశ చరిత్ర, భౌగోళికాంశాలు, ఆర్థికాంశాలు, రాజకీయాంశాలపై  ప్రశ్నలుంటాయి. తెలంగాణ చరిత్ర, భౌగోళికాంశాలు, రాష్ట్ర అవతరణ, తెలంగాణ అమరుల చరిత్ర, సాయుధ కమిటీలు, నిజాం నవాబుల చరిత్ర, టీఆర్​ఎస్​ ఏర్పాటు తర్వాత జరిగిన సంఘటనలు, తెలంగాణ సంస్కృతి, సామాజిక పరిస్థితులు, భాష, యాస, ఆట–పాట, జేఏసీ కార్యక్రమాలు మొదలైన అంశాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ఆర్థికాంశాలు, ప్రభుత్వ పథకాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. శాస్త్రీయ, సాంకేతిక అంశాలు, కరెంట్‌‌‌‌‌‌‌‌ అఫైర్స్‌‌‌‌‌‌‌‌ చూసుకోవాలి. తెలుగు అకాడమీ 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలు చదివి నోట్స్‌‌‌‌‌‌‌‌ తయారు చేసుకుంటే మంచిది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచే సుమారు 40 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 

అర్థమెటిక్‌‌‌‌‌‌‌‌

ఈ విభాగం నుంచి శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం- పని, కాలం- దూరం, వ్యాపార భాగస్వామ్యం, వైశాల్యాలు, చుట్టుకొలత, ఘనపరిమాణం, క.సా.గు., గ.సా.భా. వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.ఈ అంశాలను గ్రూపులుగా విభజించి సన్నద్ధమైతే సులభంగా నేర్చుకోవచ్చు. డేటా అనాలిసిస్‌‌‌‌‌‌‌‌, డేటా సఫిషియన్సీ నుంచి 5 ప్రశ్నలు ఒకే పట్టిక లేదా వెన్‌‌‌‌‌‌‌‌చిత్రాలు, బార్‌‌‌‌‌‌‌‌చార్ట్‌‌‌‌‌‌‌‌, గ్రాఫ్‌‌‌‌‌‌‌‌ల మీద వస్తాయి. ఇచ్చిన, అందుబాటులో ఉన్న సమాచారం నుంచి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. సింప్లిఫికేషన్‌‌‌‌‌‌‌‌ తక్కువ సమయంలో పూర్తిచేసేలా షార్ట్‌‌‌‌‌‌‌‌కట్స్‌‌‌‌‌‌‌‌, మైండ్‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌క్యులేషన్‌‌‌‌‌‌‌‌ వాడాలి. మేథమేటిక్స్‌‌‌‌‌‌‌‌ అంశాల్లో మాత్రికలు, త్రికోణమితి, ఎత్తులు-– దూరాలు, సర్డ్స్‌‌‌‌‌‌‌‌, ఇండిసెస్‌‌‌‌‌‌‌‌, ఆల్జీబ్రా అంశాలను చదవాలి.

రీజనింగ్‌‌‌‌‌‌‌‌

పోలీసుశాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో కేసులను విచారించే సమయంలో లాజికల్‌‌‌‌‌‌‌‌గా ఆలోచించాల్సి ఉంటుంది. నంబర్లు, లెటర్ల ఆధారంగా వచ్చే ప్రశ్నలను లాజికల్‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌గా పరిగణిస్తారు. సీటింగ్‌‌‌‌‌‌‌‌ అరేంజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, రక్తసంబంధాలు, దిక్కులు, పజిల్స్‌‌‌‌‌‌‌‌ వంటి అంశాలను అనలిటికల్‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌ అంశాలుగా పరిగణిస్తారు. బొమ్మల ఆధారంగా ప్రశ్నలు ఇస్తే నాన్‌‌‌‌‌‌‌‌ వెర్బల్‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌. సిరీస్‌‌‌‌‌‌‌‌ ప్రశ్నల్లో బొమ్మల మధ్య ఉండే సంబంధాన్ని బట్టి అదే తర్కం వాడుతూ సమాధానం గుర్తించాలి. సిలాజిజమ్‌‌‌‌‌‌‌‌, అసంప్షన్స్‌‌‌‌‌‌‌‌, కోర్సెస్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌, ఆర్గ్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌, కన్‌‌‌‌‌‌‌‌క్లూజన్స్‌‌‌‌‌‌‌‌, కాజ్‌‌‌‌‌‌‌‌-ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌, అసర్షన్‌‌‌‌‌‌‌‌-రీజన్‌‌‌‌‌‌‌‌, డెసిషన్‌‌‌‌‌‌‌‌ మేకింగ్‌‌‌‌‌‌‌‌ వంటివి హైలెవల్‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌ అంశాల కిందకి వస్తాయి.

సగం మార్కులు మ్యాథ్స్​

పోలీస్​ ఎంపిక పరీక్షల్లో కీలకమైనది అర్థమెటిక్​ అండ్ రీజనింగ్​.  ఎస్సైతో పాటు కానిస్టేబుల్​ పోస్టుల సిలబస్​ దాదాపు ఒకేలా ఉంటుంది. ప్రిలిమ్స్​ 200 మార్కులకు ఉండగా ఈ సబ్జెక్ట్​ నుంచే సగం (1‌‌‌‌‌‌‌‌00 మార్కులు) వస్తాయి. మెయిన్స్​ ఎస్సైలో 200  మార్కులు అర్థమెటిక్​ రీజనింగ్​ నుంచి రాగా మిగిలిన 200 మార్కులు జనరల్​ సైన్స్​ నుంచి వస్తాయి. ఎస్సై జాబ్​ కొట్టాలంటే మెయిన్స్​లో 400 మార్కులకు 250 మార్కులకు పైగా సాధించేలా టార్గెట్​ ఫిక్స్​ చేసుకొని ప్రిపేర్​ అయితే ఖాకీ కొలువు కొట్టొచ్చు. రాతపరీక్షకు సంబంధించి అర్థమెటిక్​లో 10 నుంచి 15, రీజనింగ్​లో 20 వరకు టాపిక్స్​ ఉంటాయి. వీటిని ఎక్కువగా రివిజన్​ చేస్తూ రోజూ ప్రిపరేషన్​ సమయంలో సగం టైమ్​ ఈ సబ్జెక్టుకు కేటాయిస్తూ ప్రాక్టీస్​ చేయాలి. 

ఎక్సైజ్, ర‌‌‌‌‌‌‌‌వాణాలో 677 పోస్టులు

కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌‌‌‌‌‌‌‌ర్తీతో పాటు ఎక్సైజ్, ర‌‌‌‌‌‌‌‌వాణా శాఖ‌‌‌‌‌‌‌‌లో 677 పోస్టుల భ‌‌‌‌‌‌‌‌ర్తీకి టీఎస్​ఎల్​పీఆర్​బీ నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్ రిలీజ్​ చేసింది. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌‌‌‌‌‌‌‌వో) 6, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టు కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌(ఎల్‌‌‌‌‌‌‌‌సీ) 57, ప్రొహిబిష‌‌‌‌‌‌‌‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు 614 ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మే 2 నుంచి 20వ తేదీ వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ద‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ఖాస్తు చేసుకోవాలి.

అర్హత: ఇంట‌‌‌‌‌‌‌‌ర్మీడియ‌‌‌‌‌‌‌‌ట్‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణులైన​వారు అర్హులు. మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ క‌‌‌‌‌‌‌‌లిగి ఉండాలి. నోటిఫికేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌లో తెలిపిన ఫిజిక‌‌‌‌‌‌‌‌ల్ ప్రమాణాలు ఉండాలి.
వయసు: జూలై 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండి 22 ఏళ్లు దాట‌‌‌‌‌‌‌‌కుండా ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు అన్ని కేటగిరీల అభ్యర్థులకు వర్తిస్తుంది. 
అప్లికేషన్​: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేది: 20 మే
వెబ్‌‌‌‌‌‌‌‌సైట్: www.tslprb.in
టి. సిద్ధార్థ 
శ్రీ నేతాజీ స్టడీ సర్కిల్​ 
హైదరాబాద్