కేసీ పుల్లయ్య ఫౌండేషన్ సేవలు అభినందనీయం.. సంపాదనలో కొంత భాగం సమాజ శ్రేయస్సు కోసం ఖర్చుపెట్టాలి..

కేసీ పుల్లయ్య ఫౌండేషన్ సేవలు అభినందనీయం.. సంపాదనలో కొంత భాగం సమాజ శ్రేయస్సు కోసం ఖర్చుపెట్టాలి..
  •     కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ

ముషీరాబాద్, వెలుగు: మన సంపాదనలో కొంత భాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేయాలని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ఆదివారం దోమలగూడలో వ్యాపారవేత్త కామిశెట్టి అనిల్ కుమార్ ఏర్పాటు చేసిన ‘కేసీ పుల్లయ్య ఫౌండేషన్’ ప్రధాన కార్యాలయాన్ని ఎంసీ లక్ష్మణ్​తో కలిసి ఆయన ప్రారంభించారు. తన తండ్రి కేసీ పుల్లయ్య ఆశయాలను కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను ఘనంగా సత్కరించారు.