
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ స్టర్ మూవీ ‘ఓజీ’. సాహో ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ముంబై, పుణే ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. కొత్త షెడ్యూల్‌ను ఆదివారం హైదరాబాద్‌లో షురూ చేశారు. ప్రస్తుతం ఇతర నటీనటులపై సీన్స్ తీస్తున్నారు. అతి త్వరలో పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్‌లో జాయిన్ అవబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ మూవీ సెట్స్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. దీంతోపాటు సాయిధరమ్ తేజ్‌తో కలిసి ‘బ్రో’ చిత్రంలో నటిస్తున్నారు పవన్. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. మరోవైపు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.