తెలుగు చలనచిత్ర చరిత్రలో బాలు శకం ఒక స్వర్ణ యుగం

తెలుగు చలనచిత్ర చరిత్రలో బాలు శకం ఒక స్వర్ణ యుగం
  • తెలుగు మాటకు, పాటకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత బాల సుబ్రహ్మణ్యందే
  • ఎస్పీ బాల సుబ్రమణ్యం-జీవన గానం  గ్రంథం ఆవిష్కరణ

హైదరాబాద్: గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలుగు మాటకు, పాటకు ప్రపంచ స్ధాయి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బాలు స్నేహశీలత, సంస్కారం, క్రమశిక్షణను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో బాలు శకం ఒక స్వర్ణ యుగం లాంటిది వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్ దసపల్లా హోటల్లో... హాసం సంస్థ ఆధ్వర్యంలో పీఎస్ గోపాల కృష్ణ రాసిన ఎస్పీ బాల సుబ్రమణ్యం-జీవన గానం  గ్రంథాన్ని ఆవిష్కరించారు. అలాగే సంజయ్ కిషోర్ రూపొందించిన బాలు జీవన చిత్రం డాక్యుమెటరీని ప్రారంభించారు  ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు. 
ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ ఎస్పీ బాలు నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం.. అజరామరంగా ఉంటుందని నా నామ్మకం అన్నారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం - జీవన గానం పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. అదే సమయంలో వారు లేకుండా.. వారి స్మృతిలో కార్యక్రమాన్ని నిర్వహించుకునే పరిస్థితి వ్యక్తిగతంగా.. లోటుగా అనిపిస్తుందన్నారు.

‘తన మాతృభాష సంగీతం అని చెప్పారు ఆయన..ఆది కాలం నుంచి.. వేద కాలం నుంచి .. పుణ్య కాలం నుంచి.. పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి.. రంగరించి.. మేళవించి మనకు అందించిన వారసత్వం.. సంస్కారం.. ఆ సంస్కారాన్ని పాటించే వారంతా మహానుభావులు అని నేను భావిస్తాను’ అని వెంకయ్య నాయుడు చెప్పారు. మన కుటుంబాల్లో.. మన పిల్లలు అందరూ కూడా ఇలాంటి మహనీయుల యొక్క జీవిత గాధ నుంచి.. సంస్కారం గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాటలు విని మనసు కొంత తన్మయత్వం చెంది.. సానుకూల ధృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు.   
బాల సుబ్రహ్మణ్యం నాకు అన్నయ్య: కమల హాసన్
నటుడు కమలహాసన్ మాట్లాడుతూ గాన గంధర్వ బాల సుబ్రహ్మణ్యం తనకు అన్నయ్య అని అన్నారు. తమ శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అని పేర్కొన్నారు. బాలుతో తనకున్న అనుబంధాన్ని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు వక్తలు. కార్యక్రమంలో శాంత బయో టెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డితో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.