పోలీస్ అభ్యర్థులకు 7 మార్కులు

పోలీస్ అభ్యర్థులకు 7 మార్కులు

మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్న ప్రశ్నలకు కలపనున్న రాష్ట్ర సర్కారు
పెరిగిన మార్కులతో ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఈవెంట్స్
ఫిబ్రవరి 15 నుంచి నిర్వహణకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ప్రిలిమినరీ పరీక్షలో మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్న 7 ప్రశ్నలకు సంబంధించి మార్కులను కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్‌పీఆర్‌‌బీ) ఆదివారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలు వారి ఈ నెల 30 నుంచి టీఎస్ఎల్‌‌పీఆర్‌‌‌‌బీ వెబ్‌‌సైట్‌‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. అభ్యర్థులు పార్ట్‌‌-2 అప్లికేషన్లను వెబ్‌‌సైట్​లో అప్​లోడ్ చేయాలని బోర్డు చైర్మన్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. హాల్‌‌ టికెట్‌‌ నంబర్లతోనే లాగిన్‌‌ కావాలని తెలిపారు. ఫిబ్రవరి 1న ఉదయం 8 గంటల నుంచి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు పార్ట్‌‌-2 అప్లికేషన్లను అప్ లోడ్ చేయాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు అడ్మిట్‌‌ కార్డులను డౌన్‌‌లోడ్‌‌ చేసుకోవాలని చెప్పారు. ఫిబ్రవరి 15 నుంచి ఫిజికల్ మెజర్‌‌‌‌మెంట్, ఎఫిషియెన్సీ ఈవెంట్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్ లోని సెంటర్స్ లో ఈవెంట్స్ ఉంటాయన్నారు. అడ్మిట్‌‌ కార్డుల డౌన్‌‌లోడ్‌‌లో సమస్యలుంటే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవచ్చని లేదా support@tslprb.in కు ఈ మెయిల్‌‌ ద్వారా సమాచారం ఇవ్వచ్చని సూచించారు.

బీజేవైఎం పోరాట విజయమిది : సంజయ్

ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలో మల్టీపుల్ ఆన్సర్లు ఉన్న ప్రశ్నలకు మార్కులు కలపాలని రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ స్టేట్​చీఫ్​సంజయ్​సంతోషం వ్యక్తం చేశారు. ఇది బీజేవైఎం కార్యకర్తలు, పోలీస్ అభ్యర్థుల పోరాట విజయమని ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు.