మేడారం జాతరకు 75 కోట్లు .. నిధులు కేటాయిస్తూ జీవో ఇచ్చిన ప్రభుత్వం

మేడారం జాతరకు 75 కోట్లు .. నిధులు కేటాయిస్తూ జీవో ఇచ్చిన ప్రభుత్వం
  • మేడారం జాతరకు 75 కోట్లు .. 
  • నిధులు కేటాయిస్తూ జీవో ఇచ్చిన ప్రభుత్వం

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. శుక్రవారం ఈ మేరకు జీవోను విడుదల చేసింది. అత్యధికంగా గ్రామీణ నీటి సరఫరా శాఖకు రూ.14.74 కోట్లు, ఐటీడీఏ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖకు రూ.8.28 కోట్లు కేటాయించింది.

పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖకు రూ.10.50 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.2.80 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.5.25 కోట్లు, పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖకు రూ.4.35 కోట్లు, మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.6.11 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.4 కోట్లు, విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖకు రూ.3.96 కోట్లు, జిల్లా పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖకు రూ.7.84 కోట్లు, దేవాదాయ శాఖకు రూ.1.5 కోట్లు, ఆర్టీసీకి రూ.2.25 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ.కోటి, మిగిలిన నిధులను ఇతర శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో త్వరలోనే పనులు చేపట్టడానికి ఆఫీసర్లు టెండర్లు పిలవనున్నారు. మేడారం జాతర కోసం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధులు కేటాయించినందుకు పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు.