పరస్పర బదిలీలకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్

పరస్పర బదిలీలకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్

హైద‌రాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్పర  బ‌దిలీల‌కు రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బ‌దిలీల‌కు సంబంధించి విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి  సోమవారం త‌న కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించారు. ప‌ర‌స్పర బ‌దిలీల‌కు సంబంధించిన ఉత్తర్వులను వెంట‌నే జారీ చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం  తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌కు ప్రయోజనం క‌ల‌గ‌నుంద‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.