హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ 

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ 

తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బడ్జెట్ ఆమోదంపై గవర్నర్ తమిళి సై అనుమతి తెలపకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ కు అనుమతించాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ‘లంచ్ మోషన్’ మెన్షన్ చేసిన సందర్భంలో న్యాయస్థానం కీలక వాఖ్య చేసింది. ‘ఇందులో న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుంది’ అని వ్యాఖ్యానించింది. 

లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతిస్తే తాము పూర్తి వివరాలు వెల్లడిస్తామని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్వంత్ ధవే వాదనలు వినిపించనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్  పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు హైకోర్టు విచారించనుంది.