ఏపీలో 2024లో 20 సాధారణ సెలవులు.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం

ఏపీలో 2024లో 20 సాధారణ సెలవులు..  స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది(2024) సాధారణ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పండుగలు, జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 20 రోజులను సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులు (Optional holidays) గా ప్రకటించింది. 

జనవరి 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగ సెలవులను ప్రకటించింది. జనవరి 26న రిపబ్లిక్‌ డే, మార్చి 3న మహా శివరాత్రి, మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్‌ ఫ్రై డే సెలవులు ఉంటాయని ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులో స్పష్టం చేశారు. 

ఏప్రిల్‌ 5న బాబు జగ్జీవన్‌రాం జయంతి, 9న ఉగాది, 11న రంజాన్‌, 17న శ్రీరామ నవమి, జూన్‌ 17న బక్రీద్‌ సెలవులుంటాయని తెలియజేసింది. జూలై 17న మొహర్రం, ఆగస్టు 15 ఇండిపెండెన్స్‌ డే, 26 శ్రీ కృష్ణాష్టమి, సెప్టెంబర్‌ 7న వినాయక చవితి సెలవులు, 16న ఈద్‌-ఉల్‌-ఉన్‌-నబీ పండుగల సందర్భంగా సెలవులను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అక్టోబర్‌ 2న గాంధీ జయంతి, అక్టోబర్‌ 11న దుర్గాష్టమి, 31న దీపావళి, డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ సెలవులు ఉంటాయని వెల్లడించింది . వీటితో పాటు మరో 17 ఐచ్ఛిక సెలవుల తేదీలను ప్రకటించింది .

ఆంధ్రప్రదేశ్‌లో 2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే..

* 15-01-2024న (సోమవారం) సంక్రాంతి
*  16-01-2024న (మంగళవారం) కనుమ
*  26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
*  08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
*  25-03-2024 (సోమవారం) హోలీ
*  29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
*  05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
*  09-04-2024 (మంగళవారం) ఉగాది
*  11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
*  17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
*  17-06-2024 (సోమవారం) బక్రీద్
*  17-07-2024 (బుధవారం) మొహర్రం
*  15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
*   26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
*  07-09-2024 (శనివారం) వినాయకచవితి
*  16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
*   02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
*  11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
*   31-10-2024 (గురువారం) దీపావళి
*   25-12-2024 (బుధవారం) క్రిస్మస్