గౌరవెల్లి ఘటనపై  మానవ హక్కుల కమిషన్ సీరియస్ 

గౌరవెల్లి ఘటనపై  మానవ హక్కుల కమిషన్ సీరియస్ 

హైదరాబాద్: గౌరవెల్లి ఘటనకు సంబంధించి పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టిన గౌరవెల్లి నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తప్పుబట్టింది. గౌరవెల్లి నిర్వాసితులపై దాడిని నిరసిస్తూ బీజేపీ లీగల్ సెల్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన హెచ్చార్సీ... గౌరవెల్లి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 4 లోపు గౌరవెల్లి ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించాలని నివేదికలో పేర్కొంది. పిటిషనర్లకు ప్రాణహాని ఉందని  ఫిర్యాదు అందిన నేపథ్యంలో వారికి పూర్తి రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.