ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన

ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ E2 హాస్టల్ లో వసతులు సరిగా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆర్ట్స్ కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించారు. తాగునీరు శుభ్రంగా లేకపోవడం వల్ల నిన్న ఓ విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.

తమ సమస్యల గురించి వార్డెన్ కు చెబితే అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించారు. తక్షణమే వార్డెన్ తమకు క్షమాపణ చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మరోవైపు ఓయూలో స్నాతకోత్సవం కార్యక్రమం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు.