
న్యూఢిల్లీ: తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సరైన పరిశీలన లేకుండా ఎలా తొలగిస్తారని అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసిన విషయంలో కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. కాగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. అయితే అదే సమయంలో బోగస్ రేషన్ కార్డుల పేరుతో సుమారు 19 లక్షల కార్డులను తొలగించింది. ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగివారిని గుర్తించి తీసివేసింది. చనిపోయిన వారి పేరుతో ఉన్న కార్డులతో పాటు ఇతర రాష్ట్రాల్లో కార్డులు కలిగి ఉన్నవారిని గుర్తించి ఆ కార్డులను కూడా తొలగించింది. దీంతో అర్హులమైన తమ కార్డులను తొలగించిందని పలువురు ఆరోపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. 2016లో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మళ్లీ క్షేత్ర స్థాయి పరిశీలన జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
మరికొన్ని వార్తల కోసం...