వరంగల్ లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు

వరంగల్ లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు

వరంగల్: గ్రేటర్ వరంగల్  భద్రత కోసం ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు పనిచేయకుండా పోయాయి. ప్రమాదాలు జరిగినా గుర్తించే అవకాశం లేకుండాపోయింది. సీసీ కెమెరాల నిర్వహణ అధికారులు పట్టించుకోవడం లేదని  జనం  మండిపడుతున్నారు.

సీసీ కెమెరాల నిర్వహణను గాలికొదిలిండ్రు


 
వరంగల్ మహానగరం ఏటేటా మరింతగా విస్తరిస్తోంది. వరంగల్, హనుమకొండ, ఖాజీపేట ట్రై సిటీల్లో భారీగా షాపింగ్ మాల్స్ వెలుస్తున్నాయి. నగరంలోని చారిత్రక కట్టడాలు చూసేందుకు దేశ, విదేశాల నుంచి టూరిస్టులు వస్తున్నారు. దీంతో నగరంలో భద్రతపై ఫోకస్ పెట్టారు పోలీసు అధికారులు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే గుర్తించేందుకు కాజీపేట రైల్వేస్టేషన్  నుంచి వరంగల్  రైల్వేస్టేషన్ , కాకతీయ విశ్వవిద్యాలయం వరకు 35 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని  గత నెలలో హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ –సెంటర్ కు అనుసంధానం చేశారు. అయితే సీసీ కెమెరాల నిర్వాహణను మాత్రం గాలికొదిలేశారు. వీటి మెయింటెనెన్స్ ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరిగినా రికార్డు కావడం లేదు. తగిన సాక్ష్యాధారాలు దొరకడం లేదు. 

రూ.25 లక్షలు పోయినయ్ : తిరుపతి రెడ్డి, భాదితుడు

నక్కల గుట్ట దగ్గర బ్యాంక్ లోంచి 25 లక్షలు తీసుకుని వచ్చి.. కారులో పెట్టారు. బ్యాంక్ లోకి వెళ్లి వచ్చే సరికి దొంగలు ఆ సొమ్మును ఎత్తుకుపోయారు. పోలీసులకు కంప్లైంట్ చేసినా ఇప్పటివరకు దొంగలను పట్టుకోలేకపోయారు. నిత్యం రద్దీగా ఉండే నక్కల గుట్ట దగ్గర సీసీ కెమెరా పని చేయడం లేదు.

యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని ఇప్పటికీ పట్టుకోలేదు: తిరుపతి, కేయూ స్టూడెంట్

నక్కల గుట్ట దగ్గరే బైక్ ను మరో వాహనదారుడు డీ కొట్టి దొరకకుండా వెళ్లిపోయాడు.ఈ ఘటన కూడా సీసీ కెమెరాలో  రికార్డు కాలేదు. సీసీ కెమెరాల నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి పనిచేయడం లేదని స్థానికులు చెబుతున్నారు.