
ఫుల్ జోష్ లో టీమిండియా
నేడు ఆసీస్‌తో మూడో టీ20
మ. 1.40 నుం చి సోనీసిక్స్ లో
టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్ గా మంగళవారం జరిగే చివరి మ్యాచ్ లో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఆఖరుదైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. రెండు ఓటములతో ఆసీస్ టూర్ ను షురూ చేసిన టీమిండియా ఊహించని రీతిలో వరుసగా మూడు
విక్టరీలతో స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ చేసింది. అదిరిపోయే ఆటతో టీ20 సిరీస్ నెగ్గి వన్డే పరాజయానికి బదులు తీర్చుకుంది. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్న కోహ్లీసేన వైట్ బాల్ ఫార్మాట్ లో లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు రెడీ అయింది. అదే ఊపులో ఇంకో విక్టరీ కొట్టి షార్ట్ సిరీస్‌ను స్వీప్ చేయాలని చూస్తోంది. నేడే చివరి టీ20. మరి, ఇండియా 3–0తో ముగిస్తుందా? ఆఖరాటలో నెగ్గి ఆసీస్ ఊరట దక్కించుకుంటుందా?
సిడ్నీ: ఇప్పటికే సిరీస్ మన ఖాతాలో పడింది. ప్లేయర్లందరిలో ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అటువైపు హ్యాట్రిక్ ఓటములతో ఆస్ట్రేలియా మరింత డీలా పడింది. దాంతో, టీ20 సిరీస్ ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా మంగళవారం జరిగే చివరి, మూడో మ్యాచ్ లో టీమిండియా బరిలోకి దిగుతోంది. సరిగ్గా నాలుగేళ్ల కిందటి (2016లో) టూర్ లోనూ ఇలానే వన్డేల్లో ఓడిన ఇండియా నిరాశ పరిచింది. కానీ, అద్భుతంగా పుంజుకున్న మన జట్టు టీ20ల్లో 3–0తో కంగారూలను వైట్ వాష్ చేసింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ చేయాలని కెప్టెన్ కోహ్లీ, వైట్ బాల్ పోరులో
అతని ప్రధాన ఆయుధమైన హార్దిక్ పాండ్యా ఆశిస్తున్నారు. ఈ టూర్ లో సరైన ఆరంభం లభించకపోయినా.. కాన్‌బెర్రాలో గాడిలో పడ్డ
టీమిండియా గత మ్యాచ్ లో ఆల్ రౌండర్ జడేజా లేకున్నా ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం విశేషం. పైగా, స్టార్ పేసర్లు జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ రెస్ట్ తీసుకున్నా .. అంతా కలిసి 40 గేమ్స్ కూడా ఆడని కొత్త పేస్ త్రయంపై ఆధారపడి నెగ్గడం ఇండియా టీమ్ ఆత్మవిశ్వాసాన్ని అమాంతం
పెంచింది. ముఖ్యంగా యార్కర్ల స్పెషలిస్ట్ నటరాజన్ అయితే వైట్ బాల్ సెన్సేషన్‌గా మారిపోయాడు. రోజు రోజుకూ తన పెర్ఫామెన్స్ మెరుగవుతోంది. ముఖ్యంగా సెకండ్ టీ20లో మిగతా ప్లేయర్లంతా భారీగా రన్స్ ఇచ్చుకోగా.. అతను మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పాండ్యా సూపర్ ఫీల్డింగ్, నట్టూ కంట్రోల్ చేసిన 10–15 రన్స్ వల్లే మ్యాచ్ లో ఆసీస్ ఓడింది. ఈ యంగ్ పేసర్ ను ఎదుర్కోవడం హోమ్‌టీమ్ బ్యాట్స్ మెన్‌కు సవాల్ గా మారింది.
ఫస్ట్ సిరీస్ లోనే ఈ రేంజ్ లో విజృంభించడం చూస్తే ఈ తమిళనాడు కుర్రాడు టీమ్‌లో పాగా వేసినట్టే అనిపిస్తోంది. నిలకడ చూపిస్తే 2021లో స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌కప్ లో అతనే కీలకం కానున్నా డు. నటరాజన్ తన ఫామ్ కొనసాగిస్తే థర్డ్ టీ20లోనూ జట్టుకు తిరుగుండదు. అయితే, ఆరో బౌలర్ లేకపోవడం వల్లే ఆదివారం ఇండియా భారీగా రన్స్ ఇచ్చుకుంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఈ
టూర్ లో ఇదే లాస్ట్ మ్యాచ్ కాబట్టి కోహ్లీ అతనితో బౌలింగ్ చేయిస్తాడేమో చూడాలి. అలాగే, సెకండ్ మ్యాచ్ లో విఫలమైన దీపక్ చహర్ , శార్దూల్ , చహల్ కూడా పుంజుకోవాల్సి ఉంటుంది. ఇక, బ్యాటింగ్ లోనూ క్రమంగా మెరుగైన కోహ్లీసేన ఇప్పుడు పవర్ ఫుల్ గా మారింది. రాహుల్ , కోహ్లీతో పాటు ధవన్ కూడా టచ్ లోకి రావడంతో టాపార్డర్ బలపడింది. గత పోరులో ఇరు జట్లకు మధ్య తేడా మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ పెర్ఫామెన్సే. ఆసీస్ స్టాండిన్ కెప్టెన్ మాథ్యూ వేడ్ ఔటయ్యాక ఆసీస్ జోరు తగ్గితే.. ఇటు కోహ్లీ మాత్రం పవర్ ప్లే తర్వాత కొన్ని పవర్ ఫుల్
షాట్లతో రన్‌రే ట్ పడిపోకుండా చూసుకున్నాడు. గాయపడ్డ మనీశ్ పాండే ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్ ను తీసుకోవడం కూడా కలిసొచ్చింది. ఇక, హార్దిక్ ను ఎంత పొగిడినా తక్కువే. స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్‌గా వస్తున్న అతని ఆట స్టార్ బ్యాట్స్ మన్‌ను తలపిస్తోంది. పాండ్యా మరోసారి పవర్ హిట్టింగ్ చేస్తే క్లీన్‌స్వీప్ ఈజీ కానుంది. ఈ సిరీస్ ను 3–0తో గెలిస్తే టెస్టులకు ముందు కోహ్లీసేన ఆత్మవిశ్వాసం ఎన్నో రెట్లు పెరుగుతుంది.