థియేటర్స్లో ప్లాఫ్‌ టాక్.. కట్‌ చేస్తే ఆస్కార్‌ రేస్

థియేటర్స్లో ప్లాఫ్‌ టాక్.. కట్‌ చేస్తే ఆస్కార్‌ రేస్

అక్షయ్​కుమార్(Akshay Kumar)​ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ మిషన్​రాణిగంజ్(Mission Raniganj)..ది గ్రేట్‌ భారత్‌ రెస్క్యూ. ఈ మూవీ ఆస్కార్​ బరిలో నిలవనుంది. జనరల్‌ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా ఈ చిత్ర బృందం నామినేషన్ వేసింది. గతంలో ఆర్ఆర్ఆర్​ టీం కూడా ఇదే విధంగా ఇండిపెండెంట్గా కొన్ని కేటగిరీల్లో నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాణిగంజ్ మూవీకి సైతం ఆస్కార్​ రావాలని ఫ్యాన్స్​ కోరుకుంటున్నారు.

1989లో పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్‌లోని బొగ్గు గనిలో 65మంది మైనర్లను కాపాడిన జశ్వంత్‌ సింగ్‌ గిల్‌(Jaswant Singh Gill)  జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. టిను సురేశ్​ దీనికి దర్శకుడు. అక్టోబర్‌ 6న థియేటర్లలో విడుదలైన మిషన్‌ రాణిగంజ్‌ విమర్శల ప్రశంసలందుకున్న ఈ మూవీ..కమర్షియల్ సక్సెస్ను అందుకోలేకపోయింది. దీంతో అక్షయ్ కుమార్ ఫ్లాప్ చిత్రాల జాబితాలో మిషన్ రాణిగంజ్ మూవీ కూడా చేరిపోయింది. 

ఈ మూవీలో అక్షయ్ కుమార్ జస్వంత్ పాత్రను పోషించగా..పరిణితి చోప్రా హీరోయిన్గా నటించింది. ఇందులో అక్షయ్‌ కుమార్ నటనకు ప్రశంసలు దక్కిన..సినిమా మాత్రం ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది. మరి ఆస్కార్‌ అవార్డు పోటీల్లో ఏ మేర సత్తా చాటుతుందో చూడాలి. ఆస్కార్‌ 2024 అధికారిక ఎంట్రీల కోసం పలు భారతీయ సినిమాలు పోటీ పడుతుండగా, జ్యూరీ అధికారికంగా మలయాళం బ్లాక్‌ బస్టర్‌ 2018 మూవీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.