బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నిరసనలు జరుగుతున్నాయని, రాజకీయ పార్టీలు సైతం నిరసనలు తెలిపే హక్కు ఉంటుందన న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ధర్నాచౌక్ వద్ద నిరసనలు తెలియజేస్తారని, ఒకవేళ ఒకవేళ ధర్నాచౌక్ వద్ద అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ చేసుకుంటారని ప్రశ్నించింది. ఆర్టికల్ 19 ప్రకారం నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందన్నారు. 

సాయంత్రం 4 గంటల లోపు పోలీసులు ధర్నాకు అనుమతి ఇస్తారా..? లేదా అనే విషయం తమకు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేస్తే సహకరించడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు  పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించింది. ధర్నాకు అనుమతి ఇచ్చేలా పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో పేర్కొంది బీజేపీ.