వీ6 వెలుగు కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం

వీ6 వెలుగు కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం

ఆదివాసీ గుస్సాడీ కనకరాజుకు పెన్షన్ పెండింగ్ పై వీ6 వెలుగు కథనానికి స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కనకరాజుకు ప్రతీ నెల 10 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించింది సర్కార్. మే 31 న మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంప్ ఆఫీస్ లో కనకరాజుకు స్వయంగా పెన్షన్ ఆర్డర్ కాపీని కూడా ఇచ్చారు. ఐతే 4 నెలలు గడిచినా ఇప్పటి వరకు కనకరాజుకు రూపాయి సాయం అందలేదు. కొద్ది రోజుల క్రితం కనకరాజుకు టీబీ సోకింది. దీంతో హాస్పిటల్లో వైద్యం చేయించుకునేందుకు కూడా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. గుస్సాడీ కళాకారుడు కనకరాజు పరిస్థితిపై వీ6 వెలుగు దినపత్రిక మంగళవారం ప్రత్యేక కథనం ఇచ్చింది. దీంతో పెండింగ్ లో ఉన్న 3 నెలల పెన్షన్ మొత్తాన్ని ఇస్తున్నట్టు ప్రకటించింది రాష్ట్ర సాంస్కృతిక శాఖ. కనకరాజుతో పాటు కళాకారులు 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలియ్య, భరత్ భూషణ్ లకు నెలకు 10 వేల రూపాయలు సాయం అందిస్తున్నట్టు చెప్పారు సాంస్కృతిక శాఖ డైరెక్టకర్ మామిడి హరికృష్ణ.