మృగశిర వచ్చినా.. దంచికొడుతున్న ఎండలు

మృగశిర వచ్చినా.. దంచికొడుతున్న ఎండలు
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత
  • సూర్యాపేట జిల్లా కీతవారిగూడెంలో 45.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదటి వారం పూర్తయినా ఎండలు దంచికొడుతున్నాయి. మృగశిర కార్తె వచ్చినా..సెగలు కక్కుతున్నాడు. ఎండ వేడిమి తట్టుకోలేక ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ముప్పారంలో 46 డిగ్రీలు, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వీణవంక, జగిత్యాలలోని మల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 45.7, జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లిలోని చిట్యాల, నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఖానాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మంచిర్యాలోని హాజీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూర్యాపేటలోని కీతవారిగూడెంలో 45.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలోని పలు చోట్ల బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది.