సచివాలయంలో గుడి, చర్చి, మసీద్ ​ప్రారంభం అప్పుడే..

సచివాలయంలో గుడి, చర్చి, మసీద్ ​ప్రారంభం అప్పుడే..

డా.బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని నల్ల పోచమ్మ దేవాలయం, మసీదు, చర్చిలను  ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆగస్టులో ప్రారంభించనున్నట్లు జులై 11న ప్రభుత్వం ప్రకటించింది. కొత్త సచివాలయంలో  ఈ మూడు ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటు చేశారు.  వీటి ప్రారంభానికి  అనుకూలమైన తేదీ  నిర్ణయించడానికి మూడు మత పెద్దలను సంప్రదించినట్లు ప్రభుత్వం తెలిపింది.   ఆగస్టు 25న హిందూ ఆచారాలు, నిబంధనలకు అనుగుణంగా సీఎం ఆలయాన్ని ప్రారంభించనున్నారు. 

పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అదే రోజు, కేసీఆర్ మసీదు, చర్చిలను ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి మత పెద్దలు హాజరుకానున్నారు.  సిబ్బందికి మూడు ప్రార్థనా స్థలాల్లో  ప్రవేశం ఉంటుంది.  ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులు, ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో సమావేశమై ఆలయాల ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేశారు.